NTV Telugu Site icon

SSMB 29: మహేశ్ – రాజమౌళి సినిమా కీలక అప్ డేట్.. ఇక్కడ చదవండి..

Untitled Design (1)

Untitled Design (1)

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా వెండితెరకు పరిహాయం అయి ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించినా సూపర్ స్టార్ బిరుదు అందుకుని టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం కెరీర్ లో 29వ సినిమాలో నటించబోతున్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ చిత్రనికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన లుక్ లో మారేందుకు రెడీ అవుతున్నాడు అందుకోసం బాడీ, గడ్డం పెంచబోతున్నాడు మహేశ్ బాబు.

Also Read: Devara: దేవర తెలుగు రాష్ట్రాల ప్రీమియర్స్ షోస్ లిస్ట్.. దడ పుట్టాల్సిందే..

ఈ చిత్రాన్ని మహేశ్ బాబు పుట్టిన రోజు కానుకగా ప్రకటిస్తారని ఫ్యాన్స్ ఎదురు చూసారు. కానీ ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. తాజాగా రాజమౌళి టీమ్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం అక్టోబరు 10న రాజమౌళి పుట్టినరోజు కి ssmb 29 కి సంబందించిన న్యూస్ ఏదో ఒక అప్ డేట్ ఉంటుంది. ఈ నెల చివరాఖరి నుండి యూనిట్ సభ్యులు అందరు వర్క్ షాప్ లో పాల్గొంటారని టాక్. డిసెంబరు నుండి పక్కాగా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఫస్ట్ షెడ్యూల్ ను విదేశాల్లో మొదలెట్టనున్నారు. ఫారిన్ లోని అడవులలో భారీ చేజింగ్ సిక్వెన్స్ ను చిత్రీకరించనున్నారు. మరోవైపు ఈ సినిమాకు GOLD అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో మహేశ్ సరసన నటించబోయే హీరోయిన్, అలాగే విలన్ ఎవరనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో గట్టిగా ఉంది. అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.

Show comments