SS Rajamouli-Mahesh Babu: బాబు సూపర్.. 100 అనుకుంటే 200 ఇచ్చారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli Praises Mahesh Babu: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలో మహేశ్ బాబు నటనపై జక్కన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 100 శాతం అనుకుంటే 200 ఇచ్చారని ప్రశంసలు కురిపించారు. బాబుతో కలిసి పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని రాజమౌళి పేర్కొన్నారు.
వారణాసిలో మహేశ్ బాబు తన పాత్రలో ఒదిగిపోయిన తీరు చూసి తాను ఆశ్చర్యపోయానని రాజమౌళి వెల్లడించారు. ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మహేశ్ నటనపై జక్కన్న ప్రశంసలు కురిపించారు. బాబు సామర్థ్యం గురించి ముందే తెలుసని, అయితే కలిసి పనిచేయడం ప్రారంభించిన తర్వాత తన అంచనాలను మించి నటించారని చెప్పారు. ‘మహేశ్ సామర్థ్యం నాకు ముందే తెలుసు. కానీ ఆయనతో పనిచేయడం మొదలుపెట్టాక.. నా అంచనాలకు మించి నటించారు. నేను ఊహించినదానికంటే రెండు వందల శాతం ఇచ్చారు. తన పాత్రలో ఒదిగిపోయి ప్రాణం పోశారు. అది చూసి ఆశ్చర్యపోయాను’ అని జక్కన్న చెప్పుకొచ్చారు.
Also Read
- AK 47 Release Date: ఇట్స్ అఫీషియల్.. ‘ఆదర్శ కుటుంబం’ వచ్చేది అప్పుడే!
- Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
- SS Rajamouli-Varanasi: ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా.. 'వారణాసి'పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- 418 Trailer: నేను కచ్చితంగా తల్లినై తీరాలి.. బయపెట్టేస్తున్న '418' ట్రైలర్!
వారణాసి చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దాదాపు 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం నవంబర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో.. ప్రచార కార్యక్రమాలను కూడా దశలవారీగా ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో వారణాసిపై అంచనాలు భారీగా ఉన్నాయి. టైమ్ ట్రావెల్, అడ్వెంచర్, పౌరాణిక అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
SS Rajamouli-Mahesh Babu: బాబు సూపర్.. 100 అనుకుంటే 200 ఇచ్చారు!
-
Kanaka Durga Temple: పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రులు.. నేడు దుర్గమ్మ జలవిహారం
-
COVID: కరోనాతో లింక్? చిన్నారులకు బ్రెయిన్ డ్యామేజ్! ఏకంగా 100మందిలో 39మంది..
-
Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
-
AK 47 Release Date: ఇట్స్ అఫీషియల్.. ‘ఆదర్శ కుటుంబం’ వచ్చేది అప్పుడే!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!