విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మైక్ పట్టుకుని ఎంతో ఉత్సాహంగా తన మనసులోని మాటలను పంచుకున్న ఈ బ్యూటీ.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌కు ఏకంగా ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. “ప్రతి నటీనటుడు తమ సినీ కెరీర్లో ఒక్కసారైనా త్రివిక్రమ్ గారి సెట్లో అడుగుపెట్టాలి. ఆయన వర్కింగ్ స్టైల్, ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ చూసి తీరాల్సిందే. ఈ సినిమాలో ‘స్వర్ణ’ లాంటి అద్భుతమైన పాత్రను నాకు ఇచ్చినందుకు సార్‌కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ఆయనకు ఇక్కడే ఒక విషయం చెబుతున్నా.. నా న్యూసెన్స్ ఇకపై కూడా ఆగదు. జీవితాంతం మిమ్మల్ని వదలను.. నా జీవితాంతం మిమ్మల్ని ఇలాగే విసిగిస్తూనే ఉంటాను” అంటూ త్రివిక్రమ్‌తో తనకున్న చనువును, ఆన్-సెట్ బాండింగ్‌ను శ్రీనిధి ఎంతో సరదాగా బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇదే వేదికపై తన అభిమానులకు శ్రీనిధి మరో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె తన పాత్రకు స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. “డైరెక్షన్ టీమ్‌లోని ఆనంద్ ఎంతో ఓపికగా కూర్చుని నాకు సాయం చేశారు. ఆయన సహకారంతో ఈ సినిమాలో నా పాత్రకు నేనే తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నాను. నా తెలుగ వాయిస్, నా డబ్బింగ్ మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా” అని తెలుపుతూ తెలుగు ప్రేక్షకులపై తనకున్న ప్రేమను చాటుకుంది. ఇక హీరో వెంకటేష్ గురించి మాట్లాడుతూ శ్రీనిధి ప్రశంసల వర్షం కురిపించింది. “వెంకీ సార్ గురించి నేను కొత్తగా ఏం చెప్పగలను? దేశవ్యాప్తంగా దశాబ్దాల తరబడి ఒక స్టార్‌పై ఇంతటి ఏకాభిప్రాయం, అన్ కండిషనల్ లవ్ ఉండటం చాలా అరుదు. సెట్లో ఆయనతో చేసిన కామెడీ, ఆ సరదా సంభాషణలను నేను చాలా మిస్ అవుతాను. సెట్లో నాకు ఎంతో సౌకర్యంగా ఉండేలా సపోర్ట్ చేసిన వెంకీ సార్‌కు స్పెషల్ థాంక్స్” అని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే తమన్ సంగీతం, రవి.కె.చంద్రన్ విజువల్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రశంసించిన శ్రీనిధి.. ఈ సినిమా అద్భుతంగా రావడానికి కారణమైన హారిక అండ్ హాసిని నిర్మాతలు రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీలకు తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మొత్తానికి ఒకవైపు త్రివిక్రమ్‌కి స్వీట్ వార్నింగ్ ఇస్తూనే, మరోవైపు తన డబ్బింగ్ సీక్రెట్ రివీల్ చేసిన శ్రీనిధి శెట్టి స్పీచ్ ఈవెంట్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.

