Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!

Srikanth Odela

Srikanth Odela

Srikaanth Odela: ‘దసరా’తో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నానితో చేసిన రీసెంట్ మూవీ ‘ది ప్యారడైజ్’ రిజల్ట్‌తో ఒక్కసారిగా రూటు మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ సినిమా మిగిల్చిన చేదు అనుభవంతో మెగాస్టార్ చిరంజీవితో అనుకున్న భారీ ప్రాజెక్ట్ అటకెక్కడం, అటు నాని కూడా వెంటనే మరో ఛాన్స్ ఇచ్చే మూడ్‌లో లేకపోవడంతో శ్రీకాంత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది.

తన మొదటి రెండు సినిమాల్లోనూ తెలంగాణ నేటివిటీని బలంగా చూపించిన శ్రీకాంత్, మూడో ప్రయత్నంలోనూ ఆ బ్యాక్‌డ్రాప్‌ను వదిలిపెట్టడం లేదు. అయితే ఈసారి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా, అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రా ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా అదిరిపోయే లైన్ రెడీ చేసుకున్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో సాగే ఓ ఎమోషనల్ లవ్ స్టోరీని ఆయన రాసుకున్నట్లు సమాచారం. విభజన నాటి పరిస్థితులు, ఆ సమయానికి ఇరు ప్రాంతాల మధ్య నడిచిన భావోద్వేగాల నడుమ ఓ జంట ప్రేమకథ ఎలా సాగిందనే కాన్సెప్ట్‌తో ఈ స్క్రిప్ట్ సిద్ధమవుతోందని టాక్.

‘ది ప్యారడైజ్’ ఫలితం తర్వాత అగ్ర హీరోలెవరూ వెంటనే కమిట్ అయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో, భారీ బడ్జెట్ జోలికి వెళ్లకుండా కంటెంట్ బేస్డ్‌గా ఈ ప్రాజెక్ట్‌ను లాక్ చేయాలని భావిస్తున్నారట. ఈ లవ్ స్టోరీ కోసం యంగ్ హీరోలను తీసుకుంటారా లేక పూర్తిగా కొత్త ముఖాలతో సినిమాను పట్టాలెక్కిస్తారా అనేది త్వరలోనే తేలనుంది. సరైన ఎమోషన్ పడితే ప్రేమకథలకు ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆదరణ దక్కుతుంది కాబట్టి, ఈ విభజన లవ్ స్టోరీతో శ్రీకాంత్ ఓదెల మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి.