Site icon NTV Telugu

Sridevi : ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీదేవి విజయ్ కుమార్..

Untitled Design (33)

Untitled Design (33)

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా ఈశ్వర్. ఈ చిత్రంతోనే తమిళ నటుడు విజయ్ కుమార్ కుమార్తె  శ్రీదేవి విజయ్ కుమార్ టాలీవుడ్ కు పరిచయం అయింది.  ఈ చిత్ర విజయంతో తెలుగులో పలు అవకాశాలు దక్కించుకుంది శ్రీదేవి. కానీ ఆ సినిమాలు అంతగా రాణించలేదు. దీంతో తెలుగులో పెద్దగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక పెళ్లి తరువాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది. ఈ మధ్య బుల్లి తెరపై పలు టీవీ షోలలో కనిపించింది. తాజాగా ఈ  తమిళ భామ టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

Also Read: Committee Kurrollu : కమిటీ కుర్రోళ్ళు కాదు కలెక్షన్స్ కుర్రోళ్ళు..

యంగ్ హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ రిలీజ్ కు హాజరైన శ్రీదేవి మాట్లాడుతూ ” అందరినీ మళ్ళీ కలవడం చాలా ఆనందంగా వుంది.  టీజర్ ని చూసినప్పుడు ఈశ్వర్ రోజులు గుర్తుకువచ్చాయి. ఇది చాలా మంచి కలర్ ఫుల్ ఫ్యామిలీ ఫిల్మ్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేశాను. అలాగే  ఈశ్వర్ సినిమా గురించి.. ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈశ్వర్ సినిమా తనకెంతో ప్రత్యేకం.  ఆ సినిమా అక్టోబర్ లో రీ రిలీజ్ అవ్వడం తనకెంతో ఆనందంగా ఉంది.  ఇక రెబల్ స్టార్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడని.. ఒకవేళ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండ ప్రభాస్ తో కలిసి నటిస్తానని” అని అన్నారు.

Exit mobile version