“హిట్ 3” సినిమా మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సాధించింది. అయితే ఈ సినిమాలో నటించిన నాని ఇప్పటివరకు ఇంత వైలెంట్‌గా కనిపించలేదని ప్రేక్షకులందరూ ఫీల్ అవుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో అడవి శేషు, ఈ సినిమా హీరోయిన్ శ్రీనిధి శెట్టి షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉండగా, ఆమె కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే వెంటనే అడవి శేషు చేయి వెనక్కి తీసుకోవడంతో ఆమె కాస్త డిసప్పాయింట్ అయింది.
Read More: #Single : సినిమా సింగిల్.. కానీ కలెక్షన్స్ డబుల్
ఆ వీడియో ఈవెంట్ జరిగిన రెండు, మూడు రోజులు బాగా వైరల్ అయింది. ఇక నిన్న ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. నిన్న కూడా సేమ్ సీన్ రిపీట్ చేసే ప్రయత్నం చేశాడు అడవి శేషు. వెంటనే శ్రీనిధి పక్కనే ఉన్న నానిని పిలిచి, “ఇదిగో, ఇలాగే ఆ రోజు కూడా నన్ను ఏడిపించాడు” అని చెప్పడంతో, నాని పెద్దమనిషి తరహాలో మాట్లాడుతూ ఈ ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇప్పించాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంకెందుకు, మీరు కూడా చూసేయండి మరి.
