Site icon NTV Telugu

Sreeleela: ‘అది దా సర్‌ప్రైజ్‌’.. స్టెప్ పై శ్రీలీల కామెంట్స్

Kethika

Kethika

ప్రజంట్ టాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్లో ‘రాబిన్ హుడ్’ ఒక్కటి. నితిన్, శ్రీ లీల జంటగా, వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరుగా చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ఒక్క అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. ముఖ్యంగా ‘అది దా సర్‌ప్రైజ్‌’ పాట సోషల్ మీడియా మొత్తం మారుమ్రోగిపోతోంది. ఈ ఒక్క పాట సినిమాకి కావాల్సినంత బజ్ క్రియేట్ చేసింది. కానీ సాంగ్‌లోని స్టెప్పులపై చాలా విమర్శలు వచ్చాయి. కొంతమంది, ఈ పాట కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రెచ్చిపోయారు. మహిళా కమిషన్ కూడా ఈ పాట లో డాన్స్ మహిళలని కించపరిచే విధంగా ఉన్నాయని విమర్శించారు. అయితే తాజాగా దీని గురించి శ్రీ లీల స్పందించింది.

Also Read: Plants : వేసవిలో ఇంట్లో మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

‘నేను ఐటెం సాంగ్స్ చేసాను. మాకు కంఫర్ట్‌గా ఉన్నంతవరకు ఎలాంటి తప్పు లేనట్టే, అలాగే ఆ డాన్స్ స్టెప్స్ కూడా మాకు కంఫర్ట్ గానే అనిపించాయి. అందులో ఎలాంటి సమస్య లేదు. అది ఇబ్బందిగా ఉందా లేదా అన్నది కేతిక అభిప్రాయం. మహిళా కమిషన్ చర్యలపై నేను మాట్లాడలేను, వారు సమాజానికి ఏది మంచిదో నిర్ణయించగలరు. ఒక నటిగా నా అభిప్రాయం మాత్రం.. నాకు ఇబ్బంది లేనంతవరకు ఎలాంటి సాంగ్స్ అయినా చేస్తాను’ అని తెలిపింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version