టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో శ్రీలీల ఒకరు. ఎంట్రీతోనే స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ డ్యాన్స్‌తో తిరుగులేని ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కానీ ప్రజంట్ కెరీర్ గ్రాఫ్ కాస్త డౌన్ అయింది. వరుస అవకాశాలు వస్తున్నప్పటికి హిట్‌లు మాత్రం పడటంలేదు. దీంతో ఇప్పుడు శ్రీలీల అయోమయంలో పడిపోయింది. అంతే కాదు ఈ ఫేల్యూర్ ఏకంగా తన రెమ్యునరేషన్ మీదనే పడింది.
Also Read : Naresh: నరేష్ 3.0 వెర్షన్ చూస్తారు.. మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి?
ఇటీవల శ్రీ లీల ‘పరాశక్తి’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తీకేయన్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం (సుమారు 150 కోట్లు) జనవరి 10న విడుదలైంది. అయితే, ఈ సినిమాకు శ్రీలీల తీసుకున్న పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించినప్పుడు 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన ఈ బ్యూటీ, పరాశక్తి సినిమాకు మాత్రం కేవలం కోటి రూపాయలే తీసుకున్నట్లు సమాచారం.
తెలుగులో ఆమె చేసిన ‘జూనియర్’, ‘రాబిన్‌హుడ్’ వంటి సినిమాలకు భారీ మొత్తంలో ఛార్జ్ చేసిన శ్రీ లీల, కోలీవుడ్ ఎంట్రీ కోసం ఇంతలా తగ్గించుకోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వరుసగా తగిలిన ఫ్లాపులు ఒక కారణమైతే, కోలీవుడ్ మార్కెట్‌లో నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’లో స్పెషల్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది, ప్రస్తుతం బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ సరసన కూడా నటిస్తోంది. మరి ఈ పారితోషికం తగ్గింపు శ్రీలీల కెరీర్‌కు ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
