Site icon NTV Telugu

sree leela : తమిళంలో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన డ్యాన్సింగ్ డాల్ శ్రీలీల

Untitled Design (27)

Untitled Design (27)

పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయింది యంగ్ టాలెంటెడ్ శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ మేకా హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ చిత్ర విజయంతో ఈ యంగ్ బ్యూటీకి టాలివుడ్ రెడ్ కార్పేట్ పరిచింది. స్టార్ హీరోల సినిమాలో వరుస అవకాశాలు ఇచ్చారు నిర్మాతలు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన గుంటూరు కారం, భగవంత్ కేసరి లో బాలయ్య కు కూతురుగా కూడా నటించి మెప్పించింది. కానీ టాలీవుడ్ లో శ్రీలీల హిట్ రేషియో చూసుకుంటే తక్కువ అనే చెప్పాలి.

Also Read: Priyanka Mohan: ఇదిగో ప్రియాంక.. తెలుసుకుని మాట్లాడు లేదంటే..?

వరుస ఫ్లాప్ లు పలకరించడంతో ఇటీవల తెలుగులో ఈ అమ్మడికి అవకాశాలు తాగ్గాయి. దీంతో శ్రీలీల తమిళ ఇండస్ట్రీ వైపు ద్రుష్టి మళ్లించింది. ఆ మధ్య తమిళ స్టార్ హీరోలకు జోడిగా శ్రీలీల పేరు వినిపించింది కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఫైనల్ ఇప్పుడు తమిళంలో ఛాన్స్ కొట్టేసింది ఈ యంగ్ డాల్. శివకార్తికేయన్ హీరోగా ఆకాశమే హద్దురా, గురు వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో ‘పురాణనూరు’ అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ కు జోడిగా శ్రీలీలను ఫిక్స్ చేశారు. ఇందుకు సంభందించి ఫోటో షూట్ కూడా కంప్లిట్ చేసారు. త్వరలోనే అధికారక ప్రకటన రెండు మూడు రోజుల్లో రానుంది. తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కానగరాజ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. కన్నడ, టాలీవుడ్ లో మెప్పించిన శ్రీలీల కోలీవుడ్ లో ఏ మాత్రం మెప్పిస్తుందో చూడాలి. శివకార్తికేయన్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ 25వ సినిమాగా రానుంది పురాణనూరు.

Exit mobile version