Site icon NTV Telugu

Squid Game S3 : ‘స్క్విడ్‌గేమ్ 3’ టీజర్‌ రిలీజ్‌.. !

Teja Sajja,'mirai',daggubati Rana, (1)

Teja Sajja,'mirai',daggubati Rana, (1)

2021లో విడుదలైన ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్‌ అంత చూసే ఉంటారు, ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ఈ కొరియన్ ఈ సిరీస్‌కు ఇండియాలోనూ సూపర్బ్ క్రేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఓటీటీ ఆడియెన్స్ ఈ సిరీస్‌ను ఎగబడి చూశారు. రిలీజ్ అయిన కేవలం 28 రోజుల్లో ఈ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లు చూశారు. ఈ దెబ్బకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రికార్డులు సైతం బద్దలయ్యాయి. అంతేకాదు, వివిధ అవార్డులు సైతం దక్కాయి. అందుకని ‍స్క్విడ్ గేమ్-2 సిరీస్‌ను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. కానీ మొదటి పార్ట్ రేంజ్‌లో కాకపోయినా భారీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇలా రెండు సీజన్లకు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో మూడో సీజన్‌ను కూడా తీసుకొస్తున్నారు మేకర్స్.

Also Read : Met Gala : మెట్ గాలాలో షారుఖ్ తీరు పై ఫ్యాన్స్ ఫైర్ ?

రెండో సీజన్ లోనే మూడో పార్ట్ పై హింట్ ఇయ్యగా.. ఈ ఏడాది గ్రాండ్ ఫినాలేతో రాబోతుంది తాజాగా ఈ ‘స్క్విడ్ గేమ్ సీజన్ 3’ స్ట్రీమింగ్ నుంచి టీజర్ విడుదల చేసి, స్ట్రీమింగ్‌కి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. జూన్‌ 27 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు టీమ్‌ తెలిపింది. అయితే ఈ టీజర్‌ను షేర్‌ చేసిన నెట్‌ఫ్లిక్స్..‘చివరి ఆటలను ఆడటానికి సమయం వచ్చేసింది’ అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఇదే చివరి సీజన్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్క్విడ్‌గేమ్ సీజన్ 2 సిరీస్ మొత్తం షియెంగ్‌ జీ హున్‌ చుట్టే తిరిగుతుంది. అతను ‘స్క్విడ్‌ గేమ్‌’ అన్ని దశలు పూర్తి చేసి, 45.6 బిలియన్‌ కొరియన్‌ వన్‌లు గెలుచుకుంటాడు. కానీ మనుషుల ప్రాణాలు తీసే ఈ డేంజరస్ గేమ్‌కు ఎలాగైనా ముగింపు పలకాలనుకుంటాడు షియెంగ్‌. అలా ఈ గేమ్ ఆడిస్తున్నమాస్క్‌ కలిగిన ఫ్రంట్‌ మ్యాన్‌ అనే వ్యక్తిని కనిపెట్టాలనుకుంటాడు. మరి షియెంగ్‌ అనుకున్నది సాదిస్తాడా ఫ్రంట్‌మ్యాన్‌ను అంతం చేశాడా.. లేదా అన్నది సీజన్ 3 లో చూపించనున్నారు.

 

Exit mobile version