OTT లో అత్యధిక ప్రేక్షకాదరన పొందిన సిరీస్ లో ‘స్క్విడ్ గేమ్’ ఇకటి. ఈ సిరీస్ గురించి తెలియనివారుండరు. డబ్బు కోసం ఒక మనిషి ఆడే నెత్తుటి ఆటను ఈ సిరీస్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు పార్టులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. మొదటి పార్ట్‌కు సినీ ఆడియన్స్ నుంచి విశేష స్పందన రావడంతో రెండో పార్టును రూపొందించారు.
Also Read : Kubera : ‘కుబేర’ నుంచి మరో సాలిడ్ ట్రీట్‌కు డేట్ ఫిక్స్
ఈ సెకండ్ సిరీస్‌ను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు. దీనికి బాగా క్రేజ్ రావడంతో ఇప్పుడు మూడో పార్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వంలో చివరి సిరీస్ ‘స్క్విడ్‌గేమ్ 3’ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సిరీస్ జూన్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇక గేమ్ ఎండ్‌కు వచ్చింది అంటూ తెలిపారు. అంటే ఈ మూవీకి ఇదే ఫైనల్ అనమాట.