Site icon NTV Telugu

Soubin Shahir: ఫైనాన్షియల్ ఫ్రాడ్.. మంజుమ్మల్ బాయ్ కి షాక్

Soubin

Soubin

ఇటీవల కూలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి పాపులారిటీ సంపాదించిన సౌబిన్ షాహీర్, అనుకోకుండా చిక్కుల్లో చిక్కుకున్నాడు. నిజానికి అతనే లీడ్‌గా, నిర్మాతగా మంజుమ్మల్ బాయ్స్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాకి సంబంధించి ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు నమోదు అవ్వగా, అతన్ని కేరళలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు సినిమాకి సహనిర్మాతలుగా వ్యవహరించిన వారిని కూడా అరెస్ట్ చేశారు. అయితే, తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు.

Also Read:Samantha: సమంత పట్టుకున్న ‘ఆ’ చేయి రాజ్ దేనా?

అయితే, ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతానికి జరుగుతోంది. ఈ నేపథ్యంలో అతను దుబాయ్ వెళ్లకుండా నియంత్రించారు. నిజానికి అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లేందుకు ముందుగానే పర్మిషన్ తీసుకున్నాడు, కానీ పర్మిషన్ ఇప్పుడు క్యాన్సిల్ అయింది. దుబాయ్‌లో అవార్డ్స్ ఈవెంట్‌కి షాహీర్ వెళ్లాల్సి ఉంది. కానీ, వెళ్లేందుకు ఎర్నాకులం మెజిస్ట్రేట్ కోర్టు అనుమతి ఇవ్వలేదు. ఈ కేసులో అతను జూలైలో అరెస్ట్ అయ్యాడు, వెంటనే ఆంటిసిపేటరీ బెయిల్ కూడా లభించింది. అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమాకి ఇన్వెస్టర్‌గా వ్యవహరించిన సిరాజ్, తనకు 40 శాతం లాభాల్లో వాటా ఇస్తామని చెప్పారని, ఆ లెక్క ప్రకారం 40 కోట్లు రావాలని, కానీ తనకు ఐదు కోట్ల 99 లక్షలు మాత్రమే ఇచ్చారని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Exit mobile version