Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక సినిమా కోసం రక్తం చిందించి, ప్రాణం పెట్టి పని చేసినప్పుడు.. ఆ కష్టానికి తగిన బ్లాక్ బస్టర్ విజయం దక్కితే ఆ నటుడి ఆనందం మాటల్లో చెప్పలేనిది. అచ్చం ఇలాంటి ఎమోషన్ కే గురయ్యాడు విలక్షణ నటుడు సూరి. సుహాస్, సూరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మండాడి’ చిత్రం విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్లో సూరి పంచుకున్న ఒక సెన్సేషనల్ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సినిమా ష్యూర్ షాట్ హిట్ అని తెలియగానే.. అద్దం ముందు తన షర్ట్ విప్పేసి, ఒంటిపై ఉన్న గాయాలకు తానే ముద్దులు పెట్టుకున్నానంటూ సూరి చేసిన వ్యాఖ్యలు అందరినీ కదిలిస్తున్నాయి. ‘మండాడి’ సినిమా విడుదలకు మూడు రోజుల ముందే.. హీరో సుహాస్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ తమ మిత్రులతో కలిసి స్పెషల్ షో చూశారు. సినిమా పూర్తయిన తర్వాత థియేటర్ బయట దాదాపు గంటన్నర పాటు వాళ్లు సినిమా రిజల్ట్ గురించే మాట్లాడుకున్నారట. మరుసటి రోజు ఉదయం కచ్చితంగా 7 గంటలకు సుహాస్ నుంచి సూరికి ఫోన్ వచ్చింది. “సూరి అన్నా.. నిన్న రాత్రి సినిమా చూశాను. సినిమా ఎక్స్ట్రార్డినరీ హిట్, ష్యూర్ షాట్ హిట్ అని నవీన్ సర్ చెప్పారు” అని సుహాస్ అసలు విషయం చెప్పాడు. ఆ మాట వినగానే సూరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మైత్రీ నవీన్, సుహాస్ చెప్పిన హిట్ రిపోర్ట్ వినగానే ఎమోషనల్ అయిన సూరి.. నేరుగా తన ఇంట్లోని అద్దం ముందుకు వెళ్లాడు. వెంటనే షర్ట్ విప్పేసి.. ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం పడ్డ కష్టానికి గుర్తుగా తన ఒంటిపై ఎక్కడెక్కడైతే దెబ్బలు తగిలి గాయాలు అయ్యాయో, వాటన్నింటినీ చూసుకుంటూ మురిసిపోయాడు. ఆ గాయాలకే ముద్దులు పెట్టుకుంటూ.. కన్నీళ్లు పెట్టుకుంటూ ‘థ్యాంక్యూ.. థ్యాంక్యూ’ అని తన కష్టానికి తానే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. సినిమా పట్ల ఒక నటుడికి ఉన్న పిచ్చికి, ప్యాషన్‌కి ఈ సంఘటన అద్దం పడుతోంది. తమిళంలో ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో, తెలుగులో కూడా అంతే భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవికి సూరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. వాళ్ల వల్లే ఈ సినిమా తెలుగులో ఇంత రీచ్ అయిందని ప్రశంసించాడు. అలాగే నిర్మాత ఎల్రెడ్ కుమార్, దర్శకుడు మతిమారన్, హీరోయిన్ మహిమ నంబియార్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. తనకు పూర్తి మద్దతుగా నిలిచిన సుహాస్‌కు, నటుడు రవీంద్ర విజయ్‌కు థ్యాంక్స్ చెప్పాడు. ఒక నెల ముందే సినిమా బిజినెస్ చూసి, ఇది కన్ఫామ్ హిట్ అని చెప్పిన శశిని ఈ సందర్భంగా సూరి గుర్తుచేసుకున్నాడు. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని సూరి ఉద్వేగానికి లోనయ్యాడు.
Also Read
తాజావార్తలు
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
-
Irumudi Effect : అయ్యప్ప దీక్షలో గణపయ్య.. తలపై స్వయంగా ‘ఇరుముడి’ పెడుతున్న శివుడు!
-
Allu Arjun Fans : బాక్సాఫీస్ వద్దే కాదు సామాజిక సేవలోనూ ‘తగ్గేదే లే’
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!