Site icon NTV Telugu

తల్లి పుట్టినరోజు… సోనూసూద్ ఎమోషనల్ పోస్ట్

Sonusood

కరోనా కష్టకాలంలో అలుపెరుగని సామాజిక సేవతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూసూద్. తాజాగా ఆయన తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విష్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు నాకు నేర్పించిన జీవిత పాఠాలకు ధన్యవాదాలు. ఈ సందేశాలు నేను నిన్ను ఎంతగా మిస్ అవుతున్నానో ఎప్పుడూ వ్యక్తపరచలేవు. మీరు లేకుండా నా జీవితంలో ఏర్పడిన శూన్యం నేను మిమ్మల్ని మళ్ళీ చూసేవరకు ఎప్పుడూ అలాగే ఉంటుంది” అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సోనూ ఈ పోస్ట్ తో పాటు తన తల్లికి సంబంధించిన పిక్స్ ను కూడా షేర్ చేశారు.

Read Also : పెళ్ళైయ్యాక మారానంటున్న రానా!

2007లో సోను సూద్ తన తల్లి సరోజ్ సూద్‌ను కోల్పోయారు. ఆయన తండ్రి శక్తి సూద్ 2016లో మరణించారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ నెటిజన్ల మనసును కదిలిస్తోంది. ఇక సోనుసూద్ సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు.

Exit mobile version