పెళ్ళైయ్యాక మారానంటున్న రానా!

37 సంవత్సరాల రానా దగ్గుబాటి గత యేడాది ఆగస్ట్ 8న తన గర్ల్ ఫ్రెండ్ మిహికా బజాజ్ తో కలిసి ఏడు అడుగులు నడిచాడు. దాదాపు 11 నెలల వైవాహిక జీవితం తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని రానా చెబుతున్నాడు. అంతే కాదు… పెళ్ళి తర్వాత ఇలాంటి మార్పు అందరు మనుషుల్లోనూ వస్తుందని రానా అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు మరింత బాధ్యతాయుతంగా తాను ఉంటున్నానని అన్నాడు. రానా చెబుతున్న దాని బట్టి ఆయన భార్య మిహికా… భర్తకు ఎంతో సహకరిస్తోందట, ఆమె కారణంగానే తన పనులన్నీ చాలా సజావుగా సాగిపోతున్నాయని అంటున్నాడు.

Read Also : పవర్ స్టార్ ఫ్యాన్ గా సందీప్ రెడ్డి వంగా!

సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మితమైన వెంకటేశ్ ‘నారప్ప’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిపోవడంతో… ఇప్పుడు రానా నటించిన ‘విరాట పర్వం’కు లైన్ క్లియర్ అయ్యింది. అతి త్వరలోనే దీన్ని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. సాయిపల్లవి నాయికగా నటించిన ఈ సినిమాలో జాతీయ ఉత్తమ నటి ప్రియమణితో పాటు నందితాదాస్, నివేతా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహెబ్, ఈశ్వరీరావ్, సాయిచంద్ కీలక పాత్రలు పోషించారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-