Site icon NTV Telugu

సోనూసూద్ హైదరాబాద్ కు షిఫ్ట్… ఎందుకో తెలుసా?

Sonu Sood purchase a new property in Hyderabad

ప్రముఖ నటుడు సోనూసూద్ కోవిడ్ -19 సంక్షోభ సమయంలో తాను చేసిన సేవతో రియల్ హీరోగా ఎదిగారు. భారతదేశం అంతటా ప్రజలకు అవిశ్రాంతంగా సహాయం చేస్తున్న ఈ నటుడికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దీంతో ఆయన క్రేజ్ ఇప్పుడు అమాంతంగా ఎవరెస్ట్ అంత ఎత్తుకు చేరుకుంది. ఈ కారణంగా సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించే ఆఫర్లు భారీగా వస్తున్నాయి. కొంతమంది అయితే ఏకంగా సోనూసూద్ ను హీరోగా పెట్టి సినిమా తీయడానికి కథలు రాసుకుంటున్నారు. ఇటీవల కాలంలో చాలామంది టాలీవుడ్ చిత్రనిర్మాతలు సినిమాల విషయమై సోనూసూద్ ను కలుసుకుంటున్నారు.

Read Also : శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ స్నీక్ పీక్ విడుద‌ల‌

తాజా అప్డేట్ ఏంటంటే సోనూసూద్ హైదరాబాద్ కు షిఫ్ట్ కాబోతున్నారు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా పార్క్ హయత్‌లో చెక్-ఇన్‌లు చేస్తుంటాడు. అయితే టాలీవుడ్ లో భారీగా ఆఫర్లు వస్తుండడంతో ఇక్కడ ఓ ఇంటిని కొనుగోలు చేస్తే బెటర్ అని అనుకున్నారట సోనూ. ఈ నటుడు హైదరాబాద్‌లో ఇటీవల బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. కొత్త ఇల్లు సామాజిక సేవ వంటి ఇతర పనులకు కూడా ఉపయోగించబడుతుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” చిత్రంలో సోను సూద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కోరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే సోనూసూద్ ఇక్కడ ఆస్తులు కొంటె… మన టాలీవుడ్ హీరోహీరోయిన్లు బాలీవుడ్ లో కొంటున్నారు. ఇటీవలే రామ్ చరణ్, రష్మిక మందన్న వంటి వారు అక్కడ ఇల్లు కొనుక్కున్న విషయం తెలిసిందే.

Exit mobile version