శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ స్నీక్ పీక్ విడుద‌ల‌

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో రూపొందుతోన్న 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’.. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శ‌ర్వానంద్ స‌ర‌స‌న రీతు వ‌ర్మ‌ హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలో శర్వానంద్ పోషించిన ఆది పాత్రకి సంభందించి స్నీక్ పీక్ విడుద‌ల‌ చేశారు. ఈ వీడియోలో పాట పాడమని కొంద‌రు ఆదిని కోరడంతో పాటు, కొన్ని సంగీత పరికరాలను చూపించారు. ఆ తర్వాత కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాల‌తో ఈ ప్రోమో ముగిసింది. చివ‌ర‌లో శర్వానంద్ గిటార్ వాయిస్తూ కనిపించారు. ఇందులో అక్కినేని అమల కీలక పాత్ర పోషిస్తున్నారు. నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఇతర సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-