సోనూసూద్.. సినిమాల పరంగా పక్కనపెడితే వ్యక్తిగతంగా ఆయన గురించి భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కరోనా సమయంలో ప్రభుత్వానికి మించి సహాయం చేసి ప్రజల మనసులు గెలుచుకున్నాడు. ప్రజలను వారి స్వస్థలాలకు తరలించేందుకు భారతీయ రైల్వేకు డబ్బులు కట్టి, ఆ రైళ్లల్లో వారిని పంపించాడు. అంతేకాదు.. తన హోటల్ ను ఆసుపత్రిగా మార్చి కరోనా రోగులకు సహాయం చేయడంతోపాటు ఆక్సిజన్ సిలిండర్లను వివిధ ఆసుపత్రులకు సరఫరా చేశారు. అలా దేశం మొత్తం మీద పెద్ద హీరో అయ్యాడు. అయితే ఈ నెల 10న హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సోనూసూద్ మాట్లాడుతూ..
Also Read: Dulquer : ‘కాంత’ నుండి భాగ్యశ్రీ బోర్సే అదిపోయే లుక్..
‘తెలుగు వారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఎలాంటి మూవీ వదులుకుని అయిన తెలుగు సినిమాలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. ఇక ఈ అందాల పోటీలు మాత్రమే కాదు అందులో మంచి ఉంది. మిస్ వరల్డ్ పోటీల కోసం తెలంగాణ ప్రభుత్వం, విమానాశ్రయం నుంచి హోటల్‌కు చేరుకునే వరకూ అతిథులకు చక్కటి ఏర్పాట్లు చేసింది. రానున్న 25 రోజులు ఎంతో ప్రత్యేకం. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ కంటే గొప్పగా మరొకరు నిర్వహించలేరని చెప్పాలి’ అని సోనూ సూద్ తెలిపారు. ‘రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలను దేశవ్యాప్తంగా ఉచితంగా అందిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది’ అని కూడా పేర్కొన్నారు.
