Site icon NTV Telugu

Sonal Chauhan : ‘మీర్జాపూర్‌: ది ఫిల్మ్‌’లో సోనాల్‌ ఎంట్రీ..!

Sonal Chauhan

Sonal Chauhan

తెలుగు ప్రేక్షకులకు ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘సైజ్‌ జీరో’ వంటి సినిమాల ద్వారా పరిచయమైన అందాల భామ సోనాల్‌ చౌహాన్‌ మరో సెన్సేషనల్‌ ప్రాజెక్ట్‌లో భాగమవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ సూపర్‌హిట్‌ ఫ్రాంచైజీ ‘మీర్జాపూర్’ ఇప్పుడు సినిమా రూపంలో రానుండగా, అందులో సోనాల్‌ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సోనాల్‌ కూడా తన ఆనందాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ.. “ఈ అద్భుతమైన ఆటను మార్చే ప్రయాణంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ‘మీర్జాపూర్‌: ది ఫిల్మ్‌’లో చేరడం నా కెరీర్‌లో ఒక స్పెషల్‌ మైలురాయి. నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన దర్శకుడు, నిర్మాతలకు థ్యాంక్స్‌” అని పేర్కొంది.

Also Read : Sandhya Mridul: ఫాలోవర్స్ లేని నటీనటులకి ఇండస్ట్రీలో పనిలేదు..

గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వంలో, ఫర్హాన్‌ అక్తర్‌ – రితేశ్‌ సిధ్వానీ కలసి ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే వెబ్‌ సిరీస్‌గా మూడు సీజన్లతో సక్సెస్‌ సాధించిన మీర్జాపూర్‌ ప్రపంచం ఇప్పుడు మరింత విస్తృతంగా, ఘర్షణాత్మకంగా పెద్ద తెరపైకి రాబోతోంది. సిరీస్‌లో పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, దివ్యేందు, శ్వేతా త్రిపాఠిలు చేసిన పాత్రలు ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేశాయి. ఈసారి సినిమాగా తెరకెక్కుతున్న వెర్షన్‌లో పాత తారాగణంతో పాటు కొత్తగా జితేంద్ర కుమార్, రవి కిషన్, అలాగే సోనాల్‌ చౌహాన్ వంటి ప్రముఖులు చేరుతున్నారు. సమాచారం ప్రకారం, ఈ సినిమా మీర్జాపూర్‌ ప్రాంతంలో జరుగుతున్న అధికార పోరాటాలు, అండర్‌వర్ల్డ్‌ యుద్ధాలు, గ్యాంగ్‌ల మధ్య జరుగుతున్న ప్రతీకార రాజకీయాలు చుట్టూ తిరగనుంది. క్రైమ్‌, యాక్షన్‌, ఇంటెన్స్‌ ఎమోషన్‌ల మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. మీర్జాపూర్‌ ఫ్రాంచైజీ అభిమానులకు ఇది మరొక ఘాటైన సర్ప్రైజ్‌ అవుతుందని చెప్పొచ్చు. ఇక సోనాల్‌ చౌహాన్‌ కోసం ఇది బోల్డ్‌, పవర్‌ఫుల్‌ రీ–ఎంట్రీగా మారే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

Exit mobile version