Sonal Chauhan : ‘మీర్జాపూర్: ది ఫిల్మ్’లో సోనాల్ ఎంట్రీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులకు ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘సైజ్ జీరో’ వంటి సినిమాల ద్వారా పరిచయమైన అందాల భామ సోనాల్ చౌహాన్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లో భాగమవుతోంది. అమెజాన్ ప్రైమ్ సూపర్‌హిట్ ఫ్రాంచైజీ ‘మీర్జాపూర్’ ఇప్పుడు సినిమా రూపంలో రానుండగా, అందులో సోనాల్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సోనాల్ కూడా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. “ఈ అద్భుతమైన ఆటను మార్చే ప్రయాణంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ‘మీర్జాపూర్: ది ఫిల్మ్’లో చేరడం నా కెరీర్‌లో ఒక స్పెషల్ మైలురాయి. నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చిన దర్శకుడు, నిర్మాతలకు థ్యాంక్స్” అని పేర్కొంది.
Also Read : Sandhya Mridul: ఫాలోవర్స్ లేని నటీనటులకి ఇండస్ట్రీలో పనిలేదు..
Also Read
- Pawan Kalyan : నాకు సూపర్ స్టార్ డమ్ ఉంది... ఇప్పటికీ 'OG' లాంటి సినిమాలు చేయగలను
- Ranveer Singh: కెరీర్ పీక్స్‌లో ఉండగానే షాక్.. ‘ధురంధర్’ హీరోపై బ్యాన్.. అసలు మ్యాటర్ ఇదే!
- Tamil Cinema : కోలీవుడ్ కోసం విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. వాటన్నిటికి ఇక గ్రీన్ సిగ్నల్
- Peddi : 'పెద్ది' ఐటం సాంగ్.. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది
గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో, ఫర్హాన్ అక్తర్ – రితేశ్ సిధ్వానీ కలసి ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే వెబ్ సిరీస్‌గా మూడు సీజన్లతో సక్సెస్ సాధించిన మీర్జాపూర్ ప్రపంచం ఇప్పుడు మరింత విస్తృతంగా, ఘర్షణాత్మకంగా పెద్ద తెరపైకి రాబోతోంది. సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, శ్వేతా త్రిపాఠిలు చేసిన పాత్రలు ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేశాయి. ఈసారి సినిమాగా తెరకెక్కుతున్న వెర్షన్‌లో పాత తారాగణంతో పాటు కొత్తగా జితేంద్ర కుమార్, రవి కిషన్, అలాగే సోనాల్ చౌహాన్ వంటి ప్రముఖులు చేరుతున్నారు. సమాచారం ప్రకారం, ఈ సినిమా మీర్జాపూర్ ప్రాంతంలో జరుగుతున్న అధికార పోరాటాలు, అండర్‌వర్ల్డ్ యుద్ధాలు, గ్యాంగ్‌ల మధ్య జరుగుతున్న ప్రతీకార రాజకీయాలు చుట్టూ తిరగనుంది. క్రైమ్, యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్‌ల మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. మీర్జాపూర్ ఫ్రాంచైజీ అభిమానులకు ఇది మరొక ఘాటైన సర్ప్రైజ్ అవుతుందని చెప్పొచ్చు. ఇక సోనాల్ చౌహాన్ కోసం ఇది బోల్డ్, పవర్‌ఫుల్ రీ–ఎంట్రీగా మారే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్‌లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?