Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సోనాక్షి సిన్హా. పరిశ్రమకు వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం సినిమాల ఎంపికలో రూట్ మార్చారు. త్వరలో విడుదల కానున్న ‘సిస్టమ్’ చిత్రంలో ఆమె నటి జ్యోతికతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన సోనాక్షి, నేటి సమాజంలో ఒక నిజాయతీ గల కథను తెరపైకి తీసుకురావడం ఎంత కష్టంగా మారిందో చెప్తూ ఇండస్ట్రీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన రాబోయే చిత్రం ‘సిస్టమ్’ గురించి సోనాక్షి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నేను ‘నేహా రాజ్వంశ్’ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ (లాయర్) పాత్రలో కనిపిస్తాను. తన విలువల కోసం, న్యాయం కోసం గట్టిగా నిలబడే ఒక పవర్ఫుల్ మహిళా న్యాయవాది క్యారెక్టర్ అది. నా కెరీర్లో ఇప్పటివరకు లాయర్ పాత్ర చేయలేదు, అందుకే కోర్టు సీన్లలో నటించడం నాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇక సౌత్ స్టార్ యాక్ట్రెస్ జ్యోతికతో కలిసి నటించడం ఒక అద్భుతమైన అనుభవం. ఆమె లాంటి సీనియర్ నటితో స్క్రీన్ షేర్ చేసుకోవడం వల్ల నాలోని నటనను మరింత మెరుగుపరుచుకునే అవకాశం దొరికింది” అని చెప్పారు.
Also Read
- Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ!
- Spirit Release Date Announced: ప్రభాస్' రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
చిత్ర పరిశ్రమలో క్రియేటివ్ ఫ్రీడమ్ (సృజనాత్మక స్వేచ్ఛ) తగ్గిపోవడంపై సోనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు.. ‘ప్రస్తుత కాలంలో ఒక కథను నిజాయతీగా చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది. గతంలో ఉన్నంత స్వేచ్ఛ ఇప్పుడు మేకర్స్‌కు లేదు. సమాజంలోని చేదు నిజాలను, లోపాలను నిక్కచ్చిగా చూపాలంటే భయపడాల్సిన వాతావరణం ఉంది. అందుకే వివాదాలు రాకూడదనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు చాలా జాగ్రత్తగా సేఫ్ సబ్జెక్ట్స్‌ను ఎంచుకుంటున్నారు. కొన్ని ప్రాజెక్టులు నాకు పశ్చాత్తాపాన్ని, పీడకలలను మిగిల్చాయి. కథ బాగుందని నమ్మి సైన్ చేస్తాం, కానీ షూటింగ్ సమయంలో పరిస్థితులు మారిపోయి సినిమా వేరేలా రూపుదిద్దుకుంటుంది. అప్పుడు ‘అసలు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నానా?’ అని తీవ్ర అసంతృప్తితో మదనపడ్డాను. అక్కడ ఉండాలనిపించకపోయినా, ఒప్పుకున్న పనిని పూర్తి చేసి ముందుకు సాగడమే నా పద్ధతి. జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు, నేనూ చేశాను.. వాటి నుండి నేర్చుకుని ముందుకు వెళ్ళిపోవడమే’ ముఖ్యం అని తెలిపింది సోనాక్షి సిన్హా.
అలాగే పరిశ్రమలో వచ్చిన మార్పులపై స్పందిస్తూ.. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియా ప్రభావం ఇంతలా లేదు. అందుకే నేను చాలా మంచి టైంలో ఇండస్ట్రీకి వచ్చాననిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. నేను కెరీర్ ప్రారంభించినప్పుడు అక్షరాలా ఒక పసిపాపను. కానీ ఈ 15 ఏళ్ల అనుభవం, పరిస్థితులు నన్ను ఒక మెరుగైన వ్యక్తిగా, సరైన నిర్ణయాలు తీసుకునేలా తీర్చిదిద్దాయి’ అని సోనాక్షి సిన్హా ముగించారు.
తాజావార్తలు
-
WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
-
YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
-
YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!