Site icon NTV Telugu

Solo Boy: జూలై 4న గౌతమ్ ‘సోలో బాయ్’!

Soloboy

Soloboy

బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పోసాని కృష్ణ మురళి, అనిత చైదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ALso Read: Kingdom: అనుకున్నంతా అయ్యింది!

ఇప్పటికే విడుదలైన ‘సోలో బాయ్’ ఫస్ట్ లుక్ పోస్టర్, సాంగ్ సినీ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. తాజాగా రిలీజైన పోస్టర్‌లో గౌతమ్.. రమ్య పసుపులేటితో కలిసి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్ యూత్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. యూత్‌ఫుల్ కథతో, రొమాంటిక్ వైబ్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఫుల్ ఎంగేజ్ చేయనుంది. గతంలో ‘ఆకాశ వీధుల్లో’ చిత్రంతో ఆకట్టుకున్న గౌతమ్ మరోసారి హీరోగా ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి!

Exit mobile version