RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్

Rc 17

Rc 17

రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘RC17’. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానుల్లో అనౌన్స్మెంట్‌ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా పుష్ప2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో యావత్ ప్రపంచం ఆర్సీ 17 అప్డేట్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు సుక్కు.

ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ ప్లానింగ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ అక్టోబర్ 20 అనగా  విజయదశమి శుభ ముహూర్తాన ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ దసరా పండుగ వేళ ‘RC17’ అధికారిక ప్రారంభోత్సవంతో అభిమానులకు మేకర్స్ ఒక బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. దసరా నాడు గ్రాండ్‌గా పూర్తి చేసి రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పట్టాలెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ మరియు మేకర్స్ ఒక గడువును నిర్దేశించుకున్నారు. సరిగ్గా 12 నెలల్లో షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి 2027 డిసెంబర్ నాటికి సినిమాను పూర్తి చేయాలనే లక్ష్యంతో సుకుమార్ అండ్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంగీత దర్శకుడిగా పలువురి పేరులు వినిపిస్తున్నాయి కానీ ఎవరిపేర్లు ఫైనల్ కాలేదు.