సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అందం అభినయంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్నేహ. ‘తొలి వలపు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు లోకి అడుగుపెట్టిన ఆమె.. తెలుగు, తమిళ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందరి హీరోయిన్స్‌లా కాకుండా.. పద్దతిగా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ తన న్యాచురల్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను మెప్పించింది స్నేహా.
Also Read : Genelia : పెళ్లి పుకార్లపై స్పందించిన హీరోయిన్..
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరో గురించి ఆసక్తికరంగా వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిలో తమకు ఇష్టమైన నటీనటుల పై అభిమాన భావాలు ఉండటం సహజమే. కొంతమంది అది ఓపెన్‌గా చెబుతారు, మరికొందరు మాత్రం మనసులోనే దాచుకుంటారు. కానీ స్నేహ మాత్రం తన అభిమాన నటుడిని బహిరంగంగానే వెల్లడించారు. తమిళ్ లో కమల్ హాసన్, సూర్య, విజయ్, ధనుష్, ప్రశాంత్ లాంటి టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసిన స్నేహ… వారందరిలో తనకు అజిత్ అంటే ప్రత్యేకమైన ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ‘మీకు ఇష్టమైన హీరో ఎవరు?’ అనే ప్రశ్నకు స్పందిస్తూ ‘అజిత్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయడం ఒక మంచి అనుభవం’ అని చెప్పింది.
ఇక ప్రజంట్ స్నేహ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆమె సపోర్టింగ్ రోల్స్‌కి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంది. అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లో ఉపేంద్ర భార్యగా, రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘వినయ విధేయ రామ’లో వదిన పాత్రలో, అలాగే డ్రాగన్ అనే చిత్రంలో డాక్టర్‌గా అలరించారు. తాజాగా విజయ్ హీరోగా నటించిన ‘గోట్’ సినిమాలో ఆయన భార్యగా ఆమె పోషించిన పాత్రకు మంచి స్పందన వచ్చింది.