Site icon NTV Telugu

SKN : బండ్ల గణేష్ ప్రొడక్షన్ దూరంగా ఉంటే ఇండస్ట్రీకి ప్రమాదం

Kkn Bandla Ganesh

Kkn Bandla Ganesh

నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘తెలుసు కదా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, అంచనాల మేరకు కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అయితే తాజాగా సినిమా బృందం సక్సెస్ మీట్ నిర్వహించి, సినిమాకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ కార్యక్రమానికి నిర్మాత ఎస్‌కేఎన్ తో పాటు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌కేఎన్  బండ్ల గణేష్ గురించి మాట్లాడుతూ..

Also Read : The Raja Saab: బర్త్​ డే స్పెషల్..‘రాజా సాబ్‘ నుంచి.. ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

“మీలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి దూరంగా ఉండటం ఒక పెద్ద ప్రమాదం. అందుకే బహుళంగా మంచి సినిమాలు చేయడం, కొత్త కాంబినేషన్లను ట్రై చేయడం తప్పనిసరి. ఒక మేధావి మౌనం దేశానికి ఎంత ప్రమాదకరమో, అదే రీతిగా బండ్ల గణేష్ లాంటి నిర్మాత ప్రొడక్షన్ నుంచి దూరంగా ఉంటే, ఇండస్ట్రీకి అంతే ప్రమాదకరం. ఆయన సృష్టించే సినిమాలు ప్రేక్షకులను, ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తాయి. అందుకే ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ వర్క్ ఫ్రంట్‌లో ఉండాలి” అని ఎస్కేఎన్ అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, బండ్ల గణేష్ ప్రొడక్షన్ కోసం అభిమానులు, సినీ ప్రముఖుల ఆశక్తిని మరింత పెంచాయి.

Exit mobile version