SK : శివకార్తికేయన్ లైనప్ చూస్తే మతిపోవాల్సిందే..
- బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అమరన్
- వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శివ
- సుధా కొంగరతో 25వ సినిమా ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమాతో తొలిసారి రెండు వందల కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడుశివ కార్తికేయన్. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాడు శివ. ఆ కష్టానికి తగిన గుర్తింపు అమరన్ సక్సెస్ రూపంలో వచ్చింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వచ్చిన ఈ సినిమలో సాయి పల్లవి, శివ కార్తికేయన్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు.
Also Read : UnstoppableS4 : సూర్య ఫస్ట్ క్రష్ ఏ హీరోయిన్ అంటే..?
Also Read
కాగా అమరన్ సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న శివకార్తికేయన్ వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. శివ చేతిలో ప్రస్తుతం దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వీటిలో ముందుగా స్టార్ దర్శకుడు AR మురుగదాస్ దర్శకత్వంలో కేరీర్ లో 23వ సినిమా చేస్తున్నాడు శివ. ఈ సినిమా తర్వాత గతంలో తనతో డాన్ సినిమాను డైరెక్ట్ చేసిన సీబీ చక్రవర్తితో మరో సినిమా చేస్తున్నాడు. ఇక కెరీర్ మైల్ స్టోన్ మూవీ 25వ సినిమాను లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో చేస్తున్నాడు. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. ఈ సినిమాకు ‘పురాణనూరు’ టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. ఈ మూడు సినిమాల తర్వాత విజయ్ తో గోట్ సినిమాను తెరకెక్కించిన వెంకట్ ప్రభు తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శివ. అలాగే పార్కింగ్ సినిమాతో ఆకట్టుకున్న రామ్ కుమార్, H. వినోద్, వినాయక్ చంద్రశేఖరన్ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ సినిమాలతో శివకార్తికేయన్ అగ్రనటుల రేస్ లో ఎంటర్ అవుతాడనే చెప్పాలి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!