Site icon NTV Telugu

SJ Suryah: ఆరోజే సూసైడ్ చేసుకునే వాడిని.. ఎస్జే సూర్య షాకింగ్ కామెంట్స్!

Sj Suryah

Sj Suryah

తమిళ సినిమా దర్శకుడు, నటుడు ఎస్ జె సూర్య తాజాగా జరిగిన వీర వీర శూరన్ 2 ప్రెస్ మీట్‌లో తాను డైరెక్ట్ చేసిన ఖుషి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2000 సంవత్సరంలో విజయ్, జ్యోతిక జంటగా విడుదలైన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్ షో సమయంలో తనకు కలిగిన అనుభవాలను ఆసక్తికరంగా వివరించారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. ఎస్ జె సూర్య మాట్లాడుతూ, “ఖుషి సినిమా డిస్ట్రిబ్యూటర్ షో వేసినప్పుడు అందరూ స్మశానంలో కూర్చుని సినిమా చూసినట్టు చూశారు.

Mahesh Babu : మహేశ్, సితార అదిరిపోయే స్టిల్స్.. మామూలుగా లేవుగా..

ఆ సమయంలో పరిస్థితి అలానే ఉంటే నేను అసలే పిచ్చివాడిని, సూసైడ్ చేసుకునేవాడిని” అని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఆ సమయంలో సినిమాపై ఆయనకు ఉన్న ఒత్తిడిని, ఆందోళనను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్ షో సమయంలో సినిమా చూస్తున్న వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం ఆయనను తీవ్రంగా కలవరపెట్టినట్లు తెలుస్తోంది. “కానీ తరువాతి రోజు పరిస్థితి అంతా మారిపోయింది. స్మశానంలో ఉన్నట్టు అనిపించినా రెండో రోజు ఐపీఎల్ స్టేడియం లాగా పరిస్థితి తయారయింది” అని ఆయన చెప్పారు. అంటే, సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన అనూహ్య స్పందన, ఊహించని విజయాన్ని అందించాయని చెప్పుకొచ్చారు. ఖుషి సినిమా తర్వాత విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

Exit mobile version