iPhone 18 Pro Max: సాధారణంగా సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన తర్వాతో లేదా షూటింగ్ మొత్తం పూర్తయిన సందర్భంలోనో హీరోలు, నిర్మాతలు దర్శకులకు కార్లు, ఖరీదైన కానుకలు ఇవ్వడం చూస్తుంటాం. కానీ కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ మాత్రం అందుకు భిన్నంగా అందరినీ ఆశ్చర్యపరిచారు. సినిమా ఇంకా సెట్స్ పైనే ఉండగా.. అది కూడా తొలి షెడ్యూల్ ముగియగానే తన దర్శకుడికి మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇచ్చి నెటిజన్లను ఫిదా చేశారు. తన 27వ చిత్రంగా తెరకెక్కుతున్న #SK27 ప్రాజెక్ట్ తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, దర్శకుడు రామ్‌కుమార్‌కు సరికొత్త ఖరీదైన ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ (డీప్ పర్పుల్ ఎడిషన్)ను గిఫ్ట్‌గా అందజేసి ఆశ్చర్యపరిచారు.
‘పార్కింగ్’ చిత్రంతో జాతీయ అవార్డు గెలుచుకుని ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకుడు రామ్‌కుమార్, హీరో నుంచి ఊహించని ఈ కానుక అందుకోవడంతో ఫుల్ ఖుషీ అయ్యారు. శివకార్తికేయన్ ఇచ్చిన సరికొత్త ఐఫోన్ ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. “శివకార్తికేయన్ అన్నా నుంచి ఊహించని లవబుల్ సర్ప్రైజ్ అందింది. థాంక్స్ ఫర్ ది గిఫ్ట్ ణా.. ఇది నాకు ఎంతో ప్రత్యేకం!” అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. షూటింగ్ ఆరంభ దశలోనే దర్శకుడిపై ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని ఇలా కానుక రూపంలో చూపించడం శివకార్తికేయన్కే చెల్లిందంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కాయదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. మొదటి షెడ్యూల్‌తోనే అద్భుతమైన వైబ్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Got a loveable surprise from @Siva_Kartikeyan anna ❤️ Thanks for the gift na🫂 Really means a lot! 🙏✨
#SK27 https://t.co/aYmxJwJ443— Ramkumar Balakrishnan (@ImRamkumar_B) November 2, 2026

