Site icon NTV Telugu

తండ్రి అయిన కోలీవుడ్ స్టార్… ఎమోషనల్

Sivakarthikeyan blessed with a baby boy

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ భార్య ఆర్తి నేడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జూలై 12 సోమవారం ఈ దంపతులకు అబ్బాయి పుట్టాడు. ఈ సంతోషకరమైన వార్తను ఈ యంగ్ హీరో తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వీరికి 2013లో జన్మించిన ఆరాధన అనే కుమార్తె ఉంది. ఈ నవజాత శిశువు వారి రెండవ సంతానం. అయితే ఈ వార్తను తెలియజేస్తూ శివకార్తికేయన్ ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు పుట్టుక తన తండ్రిని పోగొట్టుకున్న బాధను తగ్గించడానికి ఎలా సహాయపడిందనే విషయాన్ని ఈ నటుడు అభిమానులతో పంచుకున్నాడు. మరణించిన తన తండ్రిని ఇప్పుడు తన కొడుకులో చూడగలనని పేర్కొన్నాడు.

Read Also : బికినీలో హద్దులు దాటేస్తున్న గోవా బ్యూటీ

తన తండ్రి మోనోక్రోమ్ ఫ్రేమ్డ్ ఫోటోతో ఈ న్యూ బార్న్ బేబీ చేతిని పట్టుకున్నట్లు ఆయన షేర్ చేసిన పిక్ లో కన్పిస్తోంది. 18 సంవత్సరాల తరువాత తన తండ్రి మళ్ళీ పుట్టాడు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. “నా కళ్ళలో నీళ్ళతో ఆమెకు కృతజ్ఞతలు. బేబీ, తల్లి ఇద్దరూ బాగానే ఉన్నారు” అని చెప్పుకొచ్చారు. “కౌశల్య కృష్ణమూర్తి, జాగో, రెమో, సీమా రాజా” వంటి డబ్బింగ్ సినిమాల ద్వారా శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఈ తమిళ నటుడు ప్రస్తుతం సిబి చక్రవర్తి “డాన్”, నెల్సన్ దిలీప్‌కుమార్ “డాక్టర్”, తమిళంలో రవికుమార్ ‘అయలాన్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Exit mobile version