Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sivakarthikeyan: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తన ఫ్యాన్స్‌కి ఇచ్చిన ఒక విలువైన సలహా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా స్టార్ హీరోలు ఫ్యాన్ మీట్స్‌లో సినిమాల గురించో, బాక్సాఫీస్ రికార్డుల గురించో మాట్లాడటం చూస్తుంటాం. కానీ శివకార్తికేయన్ మాత్రం నేటి యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యపై స్పందిస్తూ, తన సొంత జీవిత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియాలో మితిమీరిన ట్రోల్స్, నెగెటివిటీ, అనవసరమైన దృష్టి మళ్లింపుల వల్ల విలువైన టైం, మానసిక ప్రశాంతత కోల్పోతున్నామని ఆయన గుర్తుచేశారు. ఈ విషతుల్యమైన వాతావరణం నుంచి బయటపడేందుకు తాను అనుసరిస్తున్న సులువైన మార్గాన్ని ఫ్యాన్స్ ముందుంచారు.
“గత ఏడాది కాలంగా నేను క్రమం తప్పకుండా పుస్తకాలు చదవడం ప్రారంభించాను. సోషల్ మీడియాలో ఉండే నెగెటివిటీ, డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండేందుకు బుక్ రీడింగ్ నాకు ఎంతో మేలు చేసింది. పుస్తకం చేతిలో ఉంటే మనసుకు ఎంతో పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. నా జీవితంలో మార్పు తెచ్చిన ఈ మంచి అలవాటును మీరూ అలవర్చుకోవాలని కోరుతున్నా. మీ ఇష్టానుసారం ఏ అంశంపై రాసిన పుస్తకమైనా సరే.. రోజుకు కనీసం పది నిమిషాల పాటు చదవండి” అని శివకార్తికేయన్ అభిమానులకు పిలుపునిచ్చారు. సినిమా గ్లామర్‌కు అతీతంగా, రోజువారీ జీవితంలో యువత మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని శివకార్తికేయన్ చేసిన ఈ విజ్ఞప్తి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గంటల తరబడి రీల్స్ చూస్తూ కాలాన్ని వృధా చేసుకునే కల్చర్‌కు బదులు, రోజుకు కనీసం పది నిమిషాల పాటు అక్షరాలతో ప్రయాణం చేయాలన్న ఆయన మాటలు సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీశాయి. ఒక స్టార్ హీరోగా సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ఇచ్చారంటూ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ నెటిజన్లు కూడా శివకార్తికేయన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
#Sivakarthikeyan:
"For the past 1 year, I started reading Books, it’s helping to avoid from social media distraction and social media toxicity. It gives good feeling. So i request you all to spend atleast 10 mins in a day for reading Books, of whatever topic you like. If a good thing happens to me, I want it to happen for you people also"— AmuthaBharathi (@CinemaWithAB) October 7, 2026
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!