Sunitha : ఎన్టీఆర్ పాటల్లో లేవా బూతులు? ఇప్పుడు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు!

Sunitha

Sunitha

సినిమా ఇండస్ట్రీ సాహిత్యంలో బోల్డ్‌నెస్ మరియు సోషల్ మీడియా వేదికగా సాగుతున్న విమర్శలపై ప్రముఖ సింగర్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ముద్దు సీన్లు ఉంటే పూలు చూపించేవారని, కానీ ఇప్పుడు ఫిల్టర్లు లేకుండా డైరెక్ట్‌గా బోల్డ్ సీన్స్, డార్క్ సబ్జెక్ట్స్ చూపిస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగానే సంభాషణలు, లిరిక్స్ కూడా మారుతాయని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాత తరం పాటలతో పోలుస్తూ ప్రస్తుతం నెట్టింట జరుగుతున్న రచ్చపై సునీత గట్టిగా మాట్లాడారు.

“ఒకప్పుడు వేటూరు గారి పాటల్లో కానీ, ఎన్టీఆర్ గారి కాలంలో వచ్చిన సినిమాల్లో కానీ డబుల్ మీనింగ్ సాంగ్స్ లేవా? అసలు ఆ టైంలో వచ్చిన ఐటెం సాంగ్స్ ఒకసారి కూర్చొని వినండి.. అందులో ఎన్ని బూతులు ఉన్నాయో మీకే అర్థమవుతుంది. నేను ఎవరినీ సమర్థించడం లేదు. కానీ, అప్పట్లోనూ దారుణమైన సాహిత్యం ఉంది, ఇప్పుడూ ఉంది. కాకపోతే అప్పట్లో ఒక అందమైన ప్యాకేజింగ్‌తో చెప్పేవారు, ఇప్పుడు నేరుగా చెప్తున్నారు, అంతే తేడా!” అని సునీత అన్నారు.

×
×
Ad

ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి ఇంత రచ్చ జరగడానికి కారణం సోషల్ మీడియానే అని సునీత విమర్శించారు. నెటిజన్లు ప్రతి విషయాన్ని హైలైట్ చేస్తూ, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లుగా చిన్న చిన్న పాయింట్స్ పట్టుకుని వివాదాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “సమాజంలో ఏ చిన్న విషయం జరిగినా, ప్రతి ఒక్కరూ అక్కడ తమ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పకపోతే ఏదో తప్పు జరిగిపోతుందనే ఫీలింగ్‌లో బతుకుతున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి చోటా తమ అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అలవాటు మానేస్తే ఈ అనవసరపు గొడవలు, ట్రోలింగ్స్ దానంతట అవే తగ్గుతాయి” అని ఆమె హితవు పలికారు.