Sunitha : ఎన్టీఆర్ పాటల్లో లేవా బూతులు? ఇప్పుడు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీ సాహిత్యంలో బోల్డ్నెస్ మరియు సోషల్ మీడియా వేదికగా సాగుతున్న విమర్శలపై ప్రముఖ సింగర్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ముద్దు సీన్లు ఉంటే పూలు చూపించేవారని, కానీ ఇప్పుడు ఫిల్టర్లు లేకుండా డైరెక్ట్‌గా బోల్డ్ సీన్స్, డార్క్ సబ్జెక్ట్స్ చూపిస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగానే సంభాషణలు, లిరిక్స్ కూడా మారుతాయని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పాత తరం పాటలతో పోలుస్తూ ప్రస్తుతం నెట్టింట జరుగుతున్న రచ్చపై సునీత గట్టిగా మాట్లాడారు.
“ఒకప్పుడు వేటూరు గారి పాటల్లో కానీ, ఎన్టీఆర్ గారి కాలంలో వచ్చిన సినిమాల్లో కానీ డబుల్ మీనింగ్ సాంగ్స్ లేవా? అసలు ఆ టైంలో వచ్చిన ఐటెం సాంగ్స్ ఒకసారి కూర్చొని వినండి.. అందులో ఎన్ని బూతులు ఉన్నాయో మీకే అర్థమవుతుంది. నేను ఎవరినీ సమర్థించడం లేదు. కానీ, అప్పట్లోనూ దారుణమైన సాహిత్యం ఉంది, ఇప్పుడూ ఉంది. కాకపోతే అప్పట్లో ఒక అందమైన ప్యాకేజింగ్‌తో చెప్పేవారు, ఇప్పుడు నేరుగా చెప్తున్నారు, అంతే తేడా!” అని సునీత అన్నారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి ఇంత రచ్చ జరగడానికి కారణం సోషల్ మీడియానే అని సునీత విమర్శించారు. నెటిజన్లు ప్రతి విషయాన్ని హైలైట్ చేస్తూ, కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లుగా చిన్న చిన్న పాయింట్స్ పట్టుకుని వివాదాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “సమాజంలో ఏ చిన్న విషయం జరిగినా, ప్రతి ఒక్కరూ అక్కడ తమ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పకపోతే ఏదో తప్పు జరిగిపోతుందనే ఫీలింగ్‌లో బతుకుతున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి చోటా తమ అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అలవాటు మానేస్తే ఈ అనవసరపు గొడవలు, ట్రోలింగ్స్ దానంతట అవే తగ్గుతాయి” అని ఆమె హితవు పలికారు.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!