తెలుగు పాపులర్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హైదరాబాద్‌లోని నిజాంపేటలో వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీ లో నివాసముంటున్న కల్పన, గత రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో, సెక్యూరిటీ అసోసియేషన్ సభ్యులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసోసియేషన్ సభ్యులు ఆమె ఫోన్‌కు కాల్ చేయగా, ఎలాంటి రెస్పాన్స్ లభించలేదు. దీంతో వారు కల్పన భర్తకు ఈ విషయాన్ని ఫోన్ చేసి వివరించగా, ఆయన ఫోన్‌కు కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.
దీంతో అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆమె ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా కల్పన స్పృహ తప్పి బెడ్ పై పడుకుని ఉంది. వారు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం నిజాంపేట్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ క్రిటికల్‌కెర్ యూటిల్‌లో వెంటిలేటర్ పై కల్పన కు చికిత్స జరుగుతుంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి సీక్రెట్‌గా ఉంచుతుంది హాస్పిటల్ సిబ్బంది. ఎందుకంటే ఆత్మహత్యాయత్నం చేసిందా? లేక రోజు తీసుకునే మెడిసిన్ డోస్ పెరిగిందా? అనేది క్లారిటీగా తెలియదు. కల్పన ఐసీయూ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె నోరు విప్పితే కానీ అసలు విషయం బయటపడుతుంది. అందిన సమాచారం ప్రకారం కల్పన ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉందని, అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకోవడం ఇందుకు కారణం అని తెలిసింది.