Site icon NTV Telugu

Sidharth Malhotra: కరణ్‌ జోహార్‌తో డెబ్యూ మూవీ.. సిద్ధార్థ్‌ షాకింగ్‌ కామెంట్స్‌..!

Sidharth Malhotra

Sidharth Malhotra

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఈయర్‌’ మూవీ తనను బాల కార్మికుడిని చేసిందంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశాడు బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్దార్థ్‌ మల్హోత్రా. ఈ మూవీతోనే సిద్దార్థ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే వరుణ్‌ ధావన్‌, అలియా భట్‌లకు కూడా ఇది డెబ్యూ మూవి. కాలేజ్‌ స్టూడెంట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే రీసెంట్‌గా కరణ్ జోహార్‌.. కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొన్న సిద్ధార్థ్‌, వరుణ్‌లు ఫుల్‌ సందడి చేశారు. ఈ సందర్భంగా తమ డెబ్యూ మూవీ స్టూడెంట్ ఆఫ్‌ ది ఈయర్‌ షూటింగ్‌ విశేషాలను, డైట్‌ విషయంలో కరణ్‌ పెట్టిన కండిషన్స్‌ గుర్తు చేసుకున్నారు.

Also Read: 3 Trains on One Track: వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు

షోలో వరుణ్‌ మాట్లాడుతూ.. ‘షూటింగ్‌ సమయంలో కరణ్‌ చాలా కండిషన్స్‌ పెట్టాడు. అది ఫస్ట్‌ మన ఫుడ్‌ నుంచి స్టార్ట్‌ చేశాడు. మూవీ అయిపోయే వరకు చాలా లిమిట్‌ ఫుట్‌ తినేవాడిని. అసలు ఆహారమే తిననిచ్చేవాడు కాదు’ అని చెప్పుకొచ్చాడు. అనంతరం సిద్ధార్థ్‌ మాట్లాడుతూ.. ‘అవును.. మన బడ్జెట్‌ ఫుడ్‌ దగ్గర నుంచే కట్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు. కనీసం నేను నీళ్లు కూడా తాగలేదు. నిజం చెప్పాలంటే స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఈయర్‌ మూవీ నాకు చైల్డ్‌ లెబర్‌ ఫీలింగ్‌ ఇచ్చింది’ అంటూ చమత్కరించాడు. ఇలా వరుణ్‌, సిద్ధార్థ్‌ కరణ్‌ను ఆటపట్టిస్తూ షోలో ఫుల్‌ జోష్‌ నింపారు. ఇక వారిద్దరు తనపై కంప్లయింట్‌ చేస్తుంటే కరణ్‌ ఎంజాయ్‌ చేస్తూ కనిపించాడు.

Also Read: Bhagavanth Kesari: బాలయ్య సినిమాకు సడీచప్పుడు లేదేంటీ.. ?

Exit mobile version