స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’లో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ‘తెలుసు కదా’ ప్రమోషన్స్‌లో, సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాలు చేసే విషయంలో సర్‌ప్రైజ్ ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు.
Also Read:Siddu Jonnalagadda: అందరిలా కాదు.. మా ట్రైలర్ కంటెంట్ అంతా సినిమాలోనూ ఉంటుంది!
“నాకు ఎవరైనా కథ చెబితే, ఆ సినిమాలో చేస్తున్నప్పుడు సదరు డైరెక్టర్ చెప్పింది చేస్తూ షూటింగ్ ముగించి ఇంటికి వెళ్లిపోయాను అనుకోండి, ఆరు నెలల తర్వాత ‘మీ సినిమా రెడీ అయింది, వచ్చి చూడండి’ అన్నప్పుడు వెళ్లి చూస్తే, ‘ఓ, ఇలా ఉందా? స్క్రీన్‌ప్లే అలా వచ్చిందా?’ అని అనిపిస్తుంది. కానీ, నాకు ఆ సర్‌ప్రైజ్ తీసుకునే అంత లగ్జరీ లేదు. సినిమా విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే, ముందు అక్కడ నేనే ఉంటాను. నా డేట్లు ఎవరూ అడగరు. శ్రీనిధి శెట్టి డేట్ల గురించి, రాశీ ఖన్నా డేట్ల గురించి ఫోన్ చేయమని చెబుతూ ఉంటాను. హీరోకేముంది? ఆయన ఒకటే సినిమా చేస్తాడు. కానీ హీరోయిన్లు, ఇతర యాక్టర్లు వేర్వేరు సినిమాలు చేస్తారు. హీరోయిన్ల డేట్ల కోసం హీరోలే వెయిట్ చేస్తారు, ఇది రియాలిటీ,” అని ఆయన చెప్పుకొచ్చారు.
