Site icon NTV Telugu

Siddu Jonnalagadda: అందరిలా కాదు.. మా ట్రైలర్ కంటెంట్ అంతా సినిమాలోనూ ఉంటుంది!

Siddu

Siddu

మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Also Read:Meesala Pilla: ‘మీసాల పిల్ల’ అదుర్స్.. మెగా గ్రేస్!

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందు రాబోతోంది. అయితే, ఈ సినిమా ట్రైలర్‌లో ఉన్న కొన్ని సీన్స్ సినిమాలో ఉండవంటూ ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. తాజాగా ఇదే విషయం మీద సిద్ధు జొన్నలగడ్డ తాజాగా విలేకరులతో ముచ్చటించాడు. ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ, ట్రైలర్‌లో ఉన్న సీన్స్ అన్నీ సినిమాలో ఉంటాయని, ట్రైలర్ కోసమే అని మేము కొన్ని సీన్స్ షూట్ మేమైతే చేయలేదని చెప్పాడు. అయితే, సెన్సార్ కారణంగా హర్ష చెప్పిన డైలాగ్ ఒకటి ట్రైలర్‌లో ఉన్నది, అది తీసేయమన్నారు. మేము ఒప్పుకుని దాన్ని తొలగించడం జరిగింది. కానీ, మిగతావి అన్నీ ట్రైలర్‌లో ఉన్న విషయాలు సినిమాలో కూడా ఉంటాయని సిద్ధు జొన్నలగడ్డ చెప్పుకొచ్చాడు.

Exit mobile version