Site icon NTV Telugu

Siddharth : ‘మిస్ యు’ రిలీజ్ వాయిదా.. కారణం ఇదే..?

Siddharth

Siddharth

సిద్దార్ధ్ హీరోగా ఆషిక రంగనాధ్ జోడిగా నటిస్తున్న చిత్రం మిస్ యు. ఈ చిత్రాన్ని మొదట ఈ నెల 29న రిలిజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అందులో భాగంగానే ప్రమోషన్స్ ను కూడా నిర్వహించారు. తెలుగు ప్రమోషన్ ను ఈ మంగళవారం నిర్వహించారు మేకర్స్. ఇంతలోనే ఈసినిమాను రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్ ఈ విషయమై ‘ మిస్ యు” సినిమా విడుదల వాయిదా పడిందని తెలియజేసారు. తమిళనాడు వ్యాప్తంగా రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. మా ప్రేక్షకుల భద్రత మరియు సౌలభ్యం మా ప్రధాన ప్రాధాన్యత. ప్రతి ఒక్కరికీ సురక్షితమైన మరియు మరింత ఆనందదాయకమైన వాతావనంలో సినిమా చూసేందుకు విడుదలను ఆలస్యం చేయడం ఉత్తమమని మేము విశ్వసిస్తున్నాము.

Also Read : Tollywood : రైటర్లుగా ఫెయిలౌతున్న స్టార్ డైరెక్టర్లు.. కారణం ఏంటి..?

మేము ప్రస్తుతం కొత్త విడుదల తేదీని ఖరారు చేసే పనిలో ఉన్నాము మరియు అతి త్వరలో విడుదల డేట్ ను ప్రకటిస్తున్నాం. మా పంపిణిదారులైన రెడ్ జెయింట్ మూవీస్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఐంగారన్ ఇంటర్నేషనల్, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి, శ్రీ కర్పగ వినయగ ఫిల్మ్ సర్క్యూట్‌లు, పివిఆర్ సినిమాస్ మరియు ఇతరులకు – చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా వేసిన కూడా తమకు మద్దతు ఇచ్చినందుకు మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అతి త్వరలో థియేటర్లలో ఈ సినిమాతో మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.మీ నమ్మకానికి మరియు మద్దతుకు హృదయపూర్వక నమస్కారములు” అని లేఖలో పేర్కొంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు మేకర్స్.

Exit mobile version