Siddharth Galla Wedding: కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేష్ బాబు మేనల్లుడు! వియత్నాంలో గ్రాండ్ వెడ్డింగ్!

Siddharth Galla Wedding South Korean Bride Vietnam

Siddharth Galla Wedding South Korean Bride Vietnam

Siddharth Galla Wedding: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. మహేష్ మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ చిన్న కొడుకు సిద్ధార్థ్ గల్లా ఓ ఇంటివాడయ్యారు. దక్షిణ కొరియాకు చెందిన హైయిన్ కిమ్‌తో ఆయన పెళ్లి ఘనంగా జరిగింది. వియత్నాంలోని అందమైన ఫూ క్వోక్ ఐలాండ్‌లో, బీచ్ అందాల నడుమ వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్, హైయిన్ కిమ్ ఒక్కటయ్యారు.

మహేష్ బాబు ఫ్యామిలీలోకి కొరియన్ కోడలు అడుగుపెట్టడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే వీళ్లిద్దరిది ఇప్పటి పరిచయం కాదట. సిద్ధార్థ్, హైయిన్ కిమ్‌లకు కాలేజీ రోజుల నుంచే మంచి పరిచయం ఉంది. ఆ ఫ్రెండ్‌షిప్ కాస్తా ప్రేమగా మారడంతో, ఇరు వైపులా పెద్దలను ఒప్పించి ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వియత్నాం వేదికగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వియత్నాంలో పెళ్లి వేడుకలు పూర్తి కావడంతో, ఈ కొత్త జంట త్వరలోనే ఇండియాకు తిరిగి రానుంది. వీరు వచ్చాక ఇక్కడ భారీ స్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేయాలని గల్లా ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశముంది.