Site icon NTV Telugu

అనకాపల్లిలో మానస వారణాసి, శ్రీదేవి హల్చల్!

Sreedevi Manasa

Sreedevi Manasa

అనకాపల్లి షాపింగ్ లో సరికొత్త నిర్వచనం చెప్పేందుకు ‘శుభప్రదం షాపింగ్ మాల్’ అడుగుపెట్టింది. గ్లామరస్ హీరోయిన్స్ మానస వారణాసి, శ్రీదేవి జాబిలి చేతులమీదుగా ఏప్రిల్ 3, శుక్రవారం ఉదయం ఈ కొత్త బ్రాంచ్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. సినీ తారల రాకతో మాల్ పరిసర ప్రాంతాలన్నీ అభిమానుల కోలాహలంతో సందడిగా మారాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాల్‌ను విజిట్ చేశారు.

అనకాపల్లి పట్టణంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌గా వెలిసిన ‘శుభప్రదం’, వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభూతిని అందించబోతోంది. ఈ సందర్భంగా సంస్థ అధినేత అల్లాక సత్యనారాయణ మాట్లాడుతూ.. “అనకాపల్లి ప్రజలకు అత్యుత్తమ ఫ్యాషన్‌ను చేరువ చేయడం మా లక్ష్యం. ఈ మాల్ ద్వారా సుమారు 100 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి కల్పించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. మమ్మల్ని ఆదరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

Exit mobile version