Site icon NTV Telugu

స్పెయిన్ లో స్పెషల్ వెకేషన్… హబ్బీతో శ్రియ హాట్ రొమాన్స్!

Shriya Saran spain vacation Pic Goes Viral

ఏ వయస్సు ముచ్చట ఆ వయస్సులో తీరిపోవాలి! పెద్దలు ఇలా అనటాన్ని శ్రియ శరణ్ తనకు వీలైన పద్ధతిలో అర్థం చేసుకున్నట్టు ఉంది! ఇండస్ట్రీలో ఇప్పుడు ఆమె కంటే పది, పదిహేనేళ్లు చిన్నవాళ్లైన యంగర్ బ్యూటీస్ వచ్చేశారు. మరి సీనియర్ సుందరికి ఆఫర్లు ఎవరు ఇస్తారు? పెద్దగా సినిమాలేవీ చేతిలో లేవు. ఒకటో రెండో తన వద్దకి వచ్చినా మిసెస్ శ్రియా కొశ్చేవ్ ఇంట్రస్ట్ చూపటం లేదు. నలభైకి దగ్గరలో ఉన్న ముదురు భామ భర్తతో కలసి ముద్దు మురిపాల్లో మునిగిపోతోంది! లేటు వయసులో ఘాటు శృంగారంతో బిజీబిజీగా ఉంది…

Read Also : కత్తి మహేష్ మృతిపై ఎంక్వయిరీ… పోలీసులకు ఏపీ గవర్నమెంట్ ఆదేశం

తన రష్యాన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చేవ్ ను ఆ మధ్య పెళ్లాడిన శ్రియా ఇండియాకి వచ్చిపోతూ ఉన్నా వరుసగా సినిమాలేం చేయటం లేదు. నెక్ట్స్ ఆమె ‘ఆర్ఆర్ఆర్’, ‘గమనం’ సినిమాల్లో కనిపించనుంది. అయితే, పర్సనల్ లైఫ్ లో మాత్రం ఫుల్ హ్యాపీగా టైంపాస్ చేస్తోంది. రెగ్యులర్ తన హాట్ ఫోటోస్, వీడియోస్ ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసే శ్రియ అప్పుడప్పుడూ మొగుడితో మురిపాలు కూడా మొహమాటం లేకుండా జనం పెట్టేస్తుంటుంది. ఇప్పుడు మరోసారి తన స్పెయిన్ వెకేషన్ తో నెటిజన్స్ లో కాక పుట్టిస్తోంది. మిష్టర్ అండ్ మిసెస్ కొశ్చేవ్ ప్రస్తుతం యూరోప్ లో రొమాంటిక్ హాలీడే ఎంజాయ్ చేస్తున్నారు. పనిలో పనిగా వాళ్లాయన అడిగితే గార్జియస్ బ్యూటీ సముద్రం నీళ్లలో హాట్ ఫోజు ఇచ్చింది. ఆయన దాన్ని కెమెరాలో క్యాప్చర్ చేశాడు! నెటిజన్స్ మాత్రం ఏం చేస్తారు? శ్రియా హాట్ లుక్ ని వైరల్ చేస్తున్నారు!

Exit mobile version