కత్తి మహేష్ మృతిపై ఎంక్వయిరీ… పోలీసులకు ఏపీ గవర్నమెంట్ ఆదేశం

చిత్ర విమర్శకుడు కత్తి మహేష్ మరణం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై ఏపీ పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే… కత్తి మహేష్ రెండు వారాల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కత్తిని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలు అయినప్పటికీ, అతని డ్రైవర్‌కు పెద్దగా గాయాలు కాలేదు. దీంతో దళిత నాయకుడు మంద కృష్ణ కూడా ఈ సందేహాలను లేవనెత్తుతూ మహేష్ మరణం వెనుక కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై జోక్యం చేసుకోవాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అంతేకాకుండా సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణ కూడా చేయాలని డిమాండ్ చేశారు.

Read Also : కోల్ కత్తాకు చేరుకున్న తలైవా !

మంద కృష్ణతో పాటు, కత్తి మహేష్ తండ్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మహేష్ మరణం గురించి ఆసుపత్రి ముందుగా తమకు తెలియాలని, కానీ వారు అలా చేయకుండా నేరుగా వార్తలను మీడియాకు విడుదల చేశారని అన్నారు. కాగా మంద కృష్ణ చేసిన అభ్యర్థనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ఈ విషయంపై పోలీసు విచారణకు ఆదేశించింది. ప్రమాదం ఎలా జరిగింది?, కత్తి మహేష్‌కు మాత్రమే ఎందుకు తీవ్ర గాయాలు అయ్యాయి? అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు డ్రైవర్‌ను ప్రశ్నించారు. విచారణలో డ్రైవర్ తాను సీట్‌బెల్ట్ ధరించానని, కత్తి మహేష్ మాత్రం సీట్ బెల్ట్ ధరించలేదని వెల్లడించినట్టు తెలిసింది. మరి రానురాను ఈ సమస్య ఏ మలుపు తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-