Site icon NTV Telugu

Shreya Dhanwanthary : ఇస్లామోఫోబి‌క్ వీడియో పై బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి ఫైర్

Shreya Dhanwanthary

Shreya Dhanwanthary

బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి తాజాగా అస్సాం బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం – ఆ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ వేదికపై షేర్ చేసిన ఒక వివాదాస్పద వీడియో. ఏఐ సాయంతో రూపొందించిన ఆ వీడియోలో మైనారిటీ వర్గాన్ని కించపరిచే కంటెంట్ ఉండటంతో, ఇది మతపరమైన ద్వేషాన్ని ప్రోత్సహిస్తోందని అనేక మంది అభిప్రాయపడ్డారు.

Also Read : Mrunal Thakur : ఆ సినిమా నా ప్రపంచాన్ని మార్చేసింది

రాబోయే ఏడాది అస్సాం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, రాజకీయ ప్రయోజనాల కోసం ద్వేషపూరిత ప్రచారాన్ని ప్రారంభించారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నటి శ్రేయా ధన్వంతరి తన ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేశారు.. “ఇది ఇండియా కాదు. ఈ వీడియో ద్వేషపూరితంగా ఉంది. ఇలాంటి హానికరమైన ప్రచారం ఎవరూ అడ్డుకోకుండా కొనసాగుతోందా? అసలేం జరుగుతోంది మన దేశంలో?” అంటూ ఆమె ప్రశ్నించారు. ఆమె ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. శ్రేయా ధన్వంతరి మాత్రమే కాకుండా, పలువురు ప్రముఖులు కూడా ఈ వీడియోపై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బీజేపీని నేరుగా టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెడుతుండగా, మరికొందరు ఇలాంటి రాజకీయ కుట్రలు వద్దు అంటూ వాపోతున్నారు. మొత్తంగా, ఈ ఘటన రాజకీయ, సినీ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. దేశ ఏకతా, మత సామరస్యాన్ని దెబ్బతీసే కంటెంట్‌ను అడ్డుకోవడం కోసం కఠిన చర్యలు తీసుకోవాలంటూ అనేక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

Exit mobile version