Shraddha Kapoor: స్త్రీ2 సక్సెస్..ఏడాది తర్వాత కెమెరా ముందుకు శ్రద్దాకపూర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లున్న హీరోయిన్‌గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే.. ఆఫర్లే కేం కొదవ. కానీ స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్దానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు కాదు.. ఫిల్మ్ మేకర్లే ఈమె డిమాండ్స్ దెబ్బకు భయపడిపోతున్నారట. ఏక్తాకపూర్, మోహిత్ సూరీ లాంటి స్టార్ మేకర్లకు చుక్కలు చూపించదట. శ్రద్దాతో సైకాలజికల్ థ్రిల్లర్ తెరకెక్కించాలని అనుకుందట ఏక్తాకపూర్ ప్రొడక్షన్ హౌస్. కానీ రెమ్యునరేషన్, లాభాల్లో వాటా అడిగి ఖంగుతినిపించిదని మొన్నామధ్య బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి.
Also Read:Hamas Leadership: అజ్ఞాతంలోకి హమాస్ అగ్రనాయకత్వం.. ఆ ముగ్గురు ఎక్కడ?..
Also Read
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా శ్రద్దా నుండి నయా ప్రాజెక్ట్ అప్డేట్ లేదు. ఫ్యాన్స్ ఈమె నెక్ట్స్ అప్డేట్ కోసం ఎదురు చూస్తుంటే బాయ్ ఫ్రెండ్‌తో షికార్లు తప్ప.. ఎనౌన్స్ మెంట్ లేదు. కానీ ప్రజెంట్ బాలీవుడ్‌లో వినిపిస్తున్న డిటైల్స్ ప్రకారం.. సాహో బ్యూటీ ఓ మూవీకి కమిటయ్యిందట. చావాతో ఫ్రూవ్ చేసుకున్న లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఫిల్మ్ చేస్తుందట. మరోసారి మరాఠీ బ్యాక్ డ్రాప్ స్టోరీ చేస్తున్నాడట లక్మణ్. స్త్రీ2తో సక్సెస్ తర్వాత మడాక్ ఫిల్మ్ మళ్లీ శ్రద్దాను పిలిచి ఓ పవర్ ఫుల్ ఫీమేల్ స్టోరినీ ఆమెకు వినిపించిందని టాక్. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట మేడమ్.
Also Read:Medha School Drugs: మేధా స్కూల్ లో ఏం జరుగుతోంది? మత్తు మందును కరస్పాండెంట్ ఎలా తయారు చేశాడు?
పాపులర్ మఠారీ నోవెల్ ఆధారంగా సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటుందట శ్రద్దా. క్లాసికల్ డ్యాన్సులు, సింగింగ్ లెసన్స్ సంబంధించిన వర్క్ షాపుల్లో పాల్గొంటుందని బాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న బజ్. ఈ నవంబర్ నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనుందట మడాక్ ఫిల్మ్స్. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. నెక్ట్స్ ఇయర్ రిలీజ్ ప్లాన్ అనుకుంటున్నారట. స్త్రీ2తో భారీ హిట్ తర్వాత శ్రద్దాను మరోసారి పిలిచిన మడాక్ ఫిల్మ్స్.. నమ్మకాన్ని మేడమ్ వమ్ము చేయదు కదా…?
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!