NTV Telugu Site icon

Shocking : సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన 12th ఫెయిల్ నటుడు

Vikrant

Vikrant

2013లో లూటేరా సినిమాతో బాలీవుడ్ పరిచయమయ్యాడు విక్రాంత్ మాన్సె. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచుకున్నాడు విక్రాంత్. ఆ తర్వాత పలు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు. ఇక 2018లో వచ్చిన మీర్జాపూర్ సిరిస్ లో విక్రాంత్ పేరు మారుమోగింది. బబ్లు పండిట్ గా ఆ సిరిస్ లో విక్రాంత్ అలరించాడు. అలాగే చిచ్చోరె సినిమాలోను అద్భుత నటన కనబరిచి ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకున్నాడు ఈ యంగ్ హీరో.

Also Read : Kanthi Dutt : సినిమా సెలెబ్రిటీస్ పరిచయాలతో కోట్లు కొట్టేసిన ‘కాంతి దత్’

ఇక గతేడాదిథియేటర్స్ లో రిలీజ్ అయిన 12th ఫెయిల్ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచుకున్నాడు విక్రాంత్. మరి ముఖ్యంగా తన ఎమోషనల్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. ఇలా వరుస హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫ్యూచర్ లో స్టార్ హీరో అవుతాడని అనుకుంటుండగా అటు ప్రేక్షకులకు, ఇటు ఫ్యాన్స్ కు ఊహించిన షాక్ ఇచ్చాడు విక్రాంత్. ‘కొన్ని సంవత్సరాలుగా మీ నుండి నేను ఎంతో ప్రేమను, అభిమానాన్నిపొందాను. మీరు చూపించే ప్రేమకు థాంక్స్. ఇక నుండి నా పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన సమయం వచ్చింది. అందుచేతనే ఇక కొత్త సినిమాలు ఏవి అంగీకరించడం లేదు. 2025లో విడుదల కానున్న సినిమానే నేను నటించిన నా లాస్ట్ సినిమా. మీరు నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను ఇచ్చారు. మీ అందరికి పేరు పేరునా కృతజ్ఞతలు’ అని పోస్ట్ చేసాడు విక్రాంత్. 37 ఏళ్ల విక్రాంత్ నటనకు స్వస్తి పలకడం ఒకింత షాకింగ్ అనే చెప్పాలి. ఇది ఏదైనా పబ్లిసిటీ స్టంట్ ఆ లేక నిజామా అని  సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Show comments