రెబల్ స్టార్ ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ గా మార్చిన సినిమా బాహుబలి. దర్శక ధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2015లో విడుదలై ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగు సినిమా స్థాయిని. ఖ్యాతిని పెంచిన సినిమా బాహుబలి. ఈ సినిమా తర్వాత నార్త్ లో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా బాహుబలి సిరీస్ ను నిర్మించిన నిర్మాత శోభు యార్లగడ్డ ఓ పాడ్‌కాస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లో బాహుబలి సినిమా పై పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
Also Read : Kanguva : నేడు వైజాగ్ బీచ్ రోడ్ లో సందడి చేయనున్న సూర్య..
శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ‘బాహుబలి’ చేయాలనుకున్నప్పుడే దానిని రెండు భాగాల్లో తెరకెక్కించాలనుకున్నాం. బడ్జెట్, కథకు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకున్నాం. సినిమా షూట్ మొదలయ్యాక అనుకున్న బడ్జెట్‌లో అది పూర్తికాదని అర్థమైంది. ఆవిధంగా ముందు ఫస్ట్ పార్ట్ షూట్ చేసి రిలీజ్ చేశాం. బాహుబలి పార్ట్ -1 విడుదలైనప్పుడు తొలిరోజు నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా అసలు బాలేదు, ప్లాప్ అనే టాక్ వచ్చింది. కానీ రెండోరోజు నుంచి టాక్ మారింది. తొలిరోజు అలా.. రెండోరోజు టాక్ వేరుగా ఉంది. నా దృష్టిలో బెన్ ఫిట్ షోస్ ఎప్పుడూ రిస్కే. ఫ్యాన్స్ ఎన్నో అంచనాలతో వస్తారు. ఏ మాత్రం అటు ఇటు అయిన బాలేదు అంటారు. ఫస్ట్ డే నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు పైకి రిలాక్స్‌గా ఉన్నా లోలోపల చాలా టెన్టన్ పడ్డాను. ఇప్పడు ఏమి చేయాలి. సెకండ్ పార్ట్ ఎలా చేయాలి అని టెన్షన్. మా అదృష్టం బాగుండి రెండవ రోజు నుండి సినిమా టాక్ మారిపోయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది” అని అన్నారు.