సమంతతో బ్రేకప్ అనంతరం, నాగచైతన్య తాను ఇష్టపడిన శోభితను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతానికి మంచి దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. సుమారు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ ఇద్దరూ, డిసెంబర్ 2024లో కేవలం అత్యంత సన్నిహితుల మధ్యలో సింపుల్‌గా మ్యారేజ్ చేసుకున్నారు. అయితే, తాజాగా నాగచైతన్య, శోభిత వంట చేస్తూ ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొన్నాళ్ల క్రితం నాగచైతన్య, శోభితకు బేసిక్ వంట కూడా రాదని కామెంట్ చేశాడు. కానీ, నాగచైతన్య కోసమే ఆమె ఇప్పుడు వంటలక్కగా మారి, వంటలు నేర్చుకున్నట్లుగా అనిపిస్తోంది.
Also Read:Teja Sajja: ఓ పెద్ద డైరెక్టర్ నన్ను 15 రోజులు వాడుకుని హ్యాండ్ ఇచ్చారు!
ఎందుకంటే, ఆ పిక్‌లో ప్రొఫెషనల్ వంట సెటప్ కనిపిస్తోంది. శోభిత ఒక్కతే అక్కడ కూర్చుని, నాగచైతన్య కోసం వంట ప్రిపేర్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఆ పోస్ట్‌కి నాగచైతన్య, ఆమె వంట స్కిల్స్ టేస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కామెంట్ చేశాడు. ఇక నాగచైతన్య, శోభిత జంట సోషల్ మీడియాలో చేస్తున్న హల్చల్ అంతా ఇంతా కాదు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు ఈ పోస్టులు బాగా ఉపయోగపడుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నాగచైతన్య వరుస సినిమాలు ఒప్పుకుంటున్నా, శోభిత మాత్రం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు ఒప్పుకుంటుంది. ఇటీవల సినీ పరిశ్రమలో పదహారేళ్లు పూర్తి చేసుకున్న నాగచైతన్య, కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.