Sampradayini Suppini Suddapusani: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అంటున్న శివాజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్, నటుడు శివాజీ మరియు లయ చాలా కాలం తర్వాత మళ్లీ జంటగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుధీర్ శ్రీరామ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ‘90’s’ వెబ్ సిరీస్ విజయం తర్వాత శివాజీ ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి పనిచేస్తుండటం విశేషం. తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను మోషన్ పోస్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చాలా ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ‘90’s’ వెబ్ సిరీస్‌లో శివాజీ, బాల నటుడు రోహన్ మధ్య వచ్చే ఈ బీజీఎం అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇప్పుడు అదే పేరును సినిమా టైటిల్‌గా పెట్టడం సినిమాపై అంచనాలను పెంచింది.
Also Read : Nara Rohit : నాలుగు రోజల పాటు నారా వారి పెళ్లి వేడుకలు
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ఈ చిత్రంలో శివాజీ పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్ పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లో శివాజీ, లయ సీరియస్‌గా నడుస్తూ ముందుకు వస్తుండగా, ‘90’s’ ఫేమ్ రోహన్ సెల్ఫీ తీసుకుంటూ కనిపించడం క్యూరియాసిటీని పెంచుతోంది. మోషన్ పోస్టర్‌ను మేకర్స్ చాలా క్రియేటివ్‌గా ప్రజెంట్ చేశారు. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ కథలో ఒక క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉన్నట్లు మోషన్ పోస్టర్ ద్వారా సూచించారు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ‘90’s’ సిరీస్‌లో శివాజీతో కలిసి నటించిన రోహన్‌తో పాటు అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాసు, కరణ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రంజిన్ రాజ్ సంగీతం అందిస్తుండగా, రిత్విక్ రెడ్డి కెమెరామెన్‌గా మరియు బాలు మనోజ్.డి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!