Site icon NTV Telugu

Shiva Nirvana : రూటు మార్చి.. రవితేజతో సినిమాకు రెడీ అవుతున్న శివ నిర్వాణ

Siva Nirvana

Siva Nirvana

శివనిర్వాణ దర్శకత్ంలో నాని, నివేథ థామస్‌ హీరోయిన్‌లుగా వచ్చిన నిన్నుకోరి మాంచి ఎమోషనల్‌ లవ్‌స్టోరీ. కాలేజ్‌లైఫ్‌, లవ్‌స్టోరీ, ప్రేమ,పెళ్లి, త్యాగం ఎమోషన్స్‌ ఎక్కడా మిస్‌ కాకుండా కథలో పర్‌ఫెక్ట్‌గా ఉండడంతో సినిమా సక్సెస్‌ అయింది. ఆ తర్వాత వచ్చిన మజిలి కూడా మనసును తాకే ప్రేమకథ కావడంతో ఈసినిమాకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నిజజీవితంలో బార్యాభర్తలు అయిన నాగచైతన్య, సమంత ఇందులో లవర్స్‌గా, బార్యాభర్తలుగా నటించడం సినిమాకు ప్లస్‌ అయింది. లవ్‌, ఎమోషన్, త్యాగం శివ నిర్వాణ మార్క్. ఇది ఈ రెండు సినిమాల సక్సెస్‌కి కారణమైంది. ఇలాంటి సినిమాలకు ట్రేడ్‌ మార్క్‌గా శివ నిర్వాణ పేరు మార్మోగింది.

Also Read : SambaralaYetiGattu : సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ గ్లింప్స్ రిలీజ్

టక్ జగదీశ్’లో శివ నిర్వాణ ఫ్యామిలీ ఎమోషన్‌లను టచ్ చేయాలని చూశాడు. కాన్సెప్ట్‌ కొత్తదైనా సీన్స్‌ స్క్రీన్‌ప్లే పాత చింతకాయ పచ్చడే. హీరో పాత్ర వరకు కొత్తగా ఉంటుంది కానీ మిగతా కథలో శివ నిర్వాణ తాలూకూ మ్యాజిక్‌ మిస్‌ కావడంతో సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు. అంతే కాదు సినిమా థియేటర్‌లో కాకుండా ఓటిటీలో రిలీజ్ కావడం కూడా సినిమా మిస్‌ఫైర్‌కి కారణమైంది.  ఆ తర్వాత ‘ఖుషి’తో లవ్ స్టోరీ జానర్‌కి తిరిగి వచ్చాడు శివ ఫీల్ ఉన్నా, సోల్ మిస్ అయింది. శివ నిర్వాణ సినిమాల్లో శృతిమించని రొమాన్స్‌ బ్యూటిఫుల్‌గా చల్లని పిల్లగాలిలా ప్రేక్షకులను తాకుతుంది. కాని ఆ ఫీల్‌ ఇందులో క్యారీ చేయడంలో ఫెయిల్‌ అయ్యాడు. అలాగే తన ట్రేడ్‌ మార్క్‌ సీన్స్‌ కూడా మిస్‌ కావడం సినిమాకి మైనస్‌గా మారింది. క్రిటిక్స్ చెప్పిన వర్డిక్ట్ “ఎమోషన్ కింగ్ ఈసారి యావరేజ్ ప్రిన్స్ గా మారిపోయాడు అన్నారు.  ఖుషీ సినిమా తేడా కొట్టడంతో శివ నిర్వాణ గేర్‌ మార్చాడు. క్లాస్‌ సినిమాలు చేసే తను ఈసారి మాస్ రూట్‌లో సినిమాలు చేయాలని డిసైడ్‌ అయ్యాడు. అందుకే మాస్‌మహారాజ్‌ రవితేజతో కొలాబరేట్‌ అవుతున్నాడు. ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ జానర్‌లో వస్తున్న ఈసినిమాకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version