Shiva Nirvana: రేయ్ సినిమా పోయింది…ఇంటికి వెళ్లిపోతామా… సినిమా సూపర్‌హిట్ అయింది…సినిమా తీయటం మానేస్తామా… సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి.. ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి…మనకి సినిమా తప్ప ఇంకా ఏమి తెలియదు రా… దీనికి తప్ప మనం దేనికి పనికిరాము .. అంటూ మాస్ మహారాజా రవితేజ ‘నేనింతే’ సినిమాలో పలికిన డైలాగ్స్ గుర్తు ఉన్నాయి కదా.. ఈ డైలాగ్స్ అచ్చం ‘ఇరుముడి’ సినిమా డైరెక్టర్ శివ నిర్వాణకు సరిపోతాయి. ఇదేదో అతిశయోక్తి అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే నిజానికి ఆయన ఇండస్ట్రీకి రాకముందు టీచర్‌గా పని చేసేవారు. కానీ సినిమా మీద ఉన్న పిచ్చి ప్రేమ ఆయనను ఇండస్ట్రీ వైపు వైపు వచ్చేలా చేసిందని పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అయితే ఆయన ఇండస్ట్రీలో కేవలం డైరెక్టర్‌గానే పరిమితం కాలేదు. రైటర్‌గా, లిరిక్ రైటర్‌గా, డ్యా్న్స్ కొరియోగ్రఫర్‌గా కూడా రాణిస్తూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. 2017లో ‘నిన్ను కోరి’ సినిమాతో టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా అడుగుపెట్టిన ఆయన తన తొలి చిత్రంతోనే సూపర్ హిట్‌ను సొంతం చేసుకొని ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. తర్వాత 2019లో మజిలీతో మరోసారి వెండి తెరపై తనదైన మ్యాజిక్‌ను చేసి ఆడియన్స్‌తో శభాష్ అనిపించుకున్నారు. ఈ చిత్రానికి ఆయన కేవలం కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించడమే కాకుండా.. ఒక సూపర్ హిట్ పాటను కూడా రాశారు. ఆ పాట “ఏడెత్తు మల్లెలే”. ఈ చిత్రంలో ఆ పాటను కాలభైరవ, నిఖితా గాంధీ పాడారు. తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన టక్ జగదీష్ సినిమాకు కూడా ఆయన ఒక పాటను రాశారు. తర్వాత వచ్చిన ఖుషీ సినిమాకు ఆయన రాసిన పాటలు మామూలు వైరల్ కాలేదు. 2023 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆల్బమ్‌లోని అన్ని పాటలను స్వయంగా డైరెక్టర్ శివ నిర్వాణ రాశారు. ఈ సాంగ్స్ అన్ని కూడా సూపర్ హిట్ సాంగ్‌గా నిలిచాయి. ఆయన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా విషయానికి వస్తే ఆయన ఈ చిత్రంలో రెండు కీలకమైన పాటలను రాశారు. ‘ఇరుముడి కట్టు’ సాంగ్‌ను కల్యాణ్ చక్రవర్తితో రాయగా, “కార్తీక మాసం” కంప్లీ్ట్ సాంగ్‌ను ఆయన ఒక్కరే రాశారు. అలాగే ఆయన ఈ చిత్రానికి దర్శకుడిగా, స్టోరీ రైటర్‌గా, లిరిక్ రైటర్‌గానే కాకుండా డ్యాన్స్ మాస్టర్‌గాను పని చేశారని స్వయంగా మాస్ మహారాజా రవితేజ ఇటీవల జరిగిన ఇరుముడి సక్సెస్ మీట్‌లో వెల్లడించారు. ఈ చిత్రంలో శివ నిర్వాణ ‘యాలాలో యాలాలో’ అని సాగే సాంగ్‌కి డ్యాన్స్ కొరియోగ్రఫి చేశారు. ఈ సాంగ్‌కి ఆయన సమకూర్చిన నృత్య రీతులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

