Sheraz Mehdi: టాలీవుడ్‌లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
- నటుడు, నిర్మాత షెరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు
- చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది
- నలుగురు వ్యక్తుల చేతుల్లోనే థియేటర్ల వ్యవస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై నటుడు, నిర్మాత షెరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితి మన తెలుగు ఇండస్ట్రీలో ఉందన్నారు. టాలీవుడ్‌లో ఒక రకమైన మాఫియా నడుస్తోందని ఆరోపించారు. కేవలం నలుగురు వ్యక్తుల చేతుల్లోనే థియేటర్ల వ్యవస్థ ఉందని షెరాజ్ మెహదీ చెప్పుకొచ్చారు.
షెరాజ్ మెహదీ దర్శకత్వం వహించి.. హీరోగా నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. ఇదివరకే విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఏప్రిల్ 24న రీ-రిలీజ్ అయింది. తాజాగా తెలుగు ఫిలిం చాంబర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. తన సినిమా రీ-రిలీజ్‌కు కూడా థియేటర్లు ఇవ్వలేదని ఆరోపించారు. ‘టాలీవుడ్‌లో ఒక రకమైన మాఫియా నడుస్తోంది. కేవలం నలుగురు వ్యక్తుల చేతుల్లోనే థియేటర్ల వ్యవస్థ ఉంది. వారు చిన్న సినిమాలను రాకుండా అడ్డుకుంటున్నారు. నా సినిమా రీ-రిలీజ్ కోసం ప్రయత్నిస్తే.. కనీసం ఒక్క థియేటర్ కూడా కేటాయించలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
‘ఈ వివక్ష నా ఒక్కడికే పరిమితం కాలేదు. ఇండస్ట్రీలో ఇది వ్యవస్థాగతంగా జరుగుతోంది. దీనిపై మేము లీగల్‌గా పోరాటం ప్రారంభించాము. ఇండస్ట్రీలోని పెద్దలకు నోటీసులు పంపాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఈ పరిస్థితిని వివరిస్తూ ఫిర్యాదు చేశాం. ప్రపంచంలో ఏ సినిమా పరిశ్రమలో లేని దారుణమైన పరిస్థితులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాయి. చివరకు బాలీవుడ్‌లో కూడా ఇంతటి వివక్ష ఉండదు’ అని షెరాజ్ మెహదీ వ్యాఖ్యానించారు. చిన్న సినిమాల మనుగడను దెబ్బతీసే విధంగా సెన్సార్ బోర్డు నిబంధనలు ఉన్నాయని, అలాగే ఏడీసీసీ వంటి అదనపు చార్జీలు భరించలేక నిర్మాతలు కుంగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు